ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రభాస్
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదే సినిమాలో, ఈ ఇద్దరు హీరోలతో పాటు బాహుబలి ప్రభాస్ కూడా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నిజంగా బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. సరిగ్గా ఇలాంటి మాస్టర్ ప్లానే వేశాడు దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ కోసం ప్రభాస్ ను రంగంలోకి దించుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ ప్రచార గీతాన్ని షూట్ చేస్తున్నాడు రాజమౌళి. దీని కోసం రెండు ప్రాంతాల్లో 2 భారీ సెట్స్ […]
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదే సినిమాలో, ఈ ఇద్దరు హీరోలతో పాటు బాహుబలి ప్రభాస్ కూడా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నిజంగా బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. సరిగ్గా ఇలాంటి మాస్టర్ ప్లానే వేశాడు దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ కోసం ప్రభాస్ ను రంగంలోకి దించుతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ ప్రచార గీతాన్ని షూట్ చేస్తున్నాడు రాజమౌళి. దీని కోసం రెండు ప్రాంతాల్లో
2 భారీ సెట్స్ వేశారు. సినిమాకు సంబంధించి నటీనటులు, టెక్నీషియన్స్ అంతా ఈ సాంగ్ లో
కనిపిస్తారు. వీళ్లతో పాటు తను గతంలో డైరక్ట్ చేసిన హీరోల్ని కూడా ఈ సాంగ్ లో చూపించాలనేది
రాజమౌళి ప్లాన్.
ఇందులో భాగంగా ప్రభాస్, రవితేజ, నాని, సునీల్ లాంటి నటులు ఆర్ఆర్ఆర్ ప్రచార గీతంలో కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పాటను సినిమాలో రోలింగ్ టైటిల్స్ పై వేయబోతున్నారు. ఇవాళ్టి నుంచి అలియా భట్ కూడా సెట్స్ పైకొచ్చింది.