Telugu Global
Cinema & Entertainment

మంచి రోజులొచ్చాయంటున్న మారుతి

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వి-సెల్యులాయిడ్ పై ఎస్ కే ఎన్ నిర్మిస్తున్నాడు. టాక్సీవాలా తర్వాత […]

మంచి రోజులొచ్చాయంటున్న మారుతి
X

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు
మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్
అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. మహానుభావుడు లాంటి
సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాను వి-సెల్యులాయిడ్ పై ఎస్ కే ఎన్ నిర్మిస్తున్నాడు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో
వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ సంస్ధ‌, ఎస్ కే ఎన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో
ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా రాబోతుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన
యూవీ కాన్సెప్ట్స్ తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది.
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు. మరో షెడ్యూల్ లో సినిమా టోటల్
షూటింగ్ పూర్తిచేయబోతున్నారు.

First Published:  21 July 2021 11:09 AM IST
Next Story