Telugu Global
International

అన్ని వేరియంట్లకు ఒకటే "సూపర్" మందు

కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ముప్పతిప్పలు పెడుతుంది. అంతేకాకుండా రోజుకో మ్యుటేషన్ తో వైరస్ తన రూపుని మార్చేసుకుంటుంది. అందుకే వ్యాక్సిన్ కనుగొన్నా, మెడిసిన్ కనుగొందామన్నా చాలా ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఈ సారి సైంటిస్టులు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటంటే.. రోజుకో రూపు మార్చుకుంటున్న వైరస్ కు ఒకే యాంటీబాడీతో చెక్ పెట్టే పనిలో పడ్డారు అమెరికన్ శాస్త్రవేత్తలు. అన్నిరకాల కరోనా వైరస్‌లను కనిపెట్టగలిగే ఓ కొత్త యాంటీబాడీని గుర్తించారు. మొత్తం 12 యాంటీబాడీల […]

అన్ని వేరియంట్లకు ఒకటే సూపర్ మందు
X

కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ముప్పతిప్పలు పెడుతుంది. అంతేకాకుండా రోజుకో మ్యుటేషన్ తో వైరస్ తన రూపుని మార్చేసుకుంటుంది. అందుకే వ్యాక్సిన్ కనుగొన్నా, మెడిసిన్ కనుగొందామన్నా చాలా ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఈ సారి సైంటిస్టులు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటంటే..

రోజుకో రూపు మార్చుకుంటున్న వైరస్ కు ఒకే యాంటీబాడీతో చెక్ పెట్టే పనిలో పడ్డారు అమెరికన్ శాస్త్రవేత్తలు. అన్నిరకాల కరోనా వైరస్‌లను కనిపెట్టగలిగే ఓ కొత్త యాంటీబాడీని గుర్తించారు. మొత్తం 12 యాంటీబాడీల మీద అధ్యయనం చేసి ఎస్‌2హెచ్‌97 అనే ఓ యాంటీబాడీని కనిపెట్టారు. ఇది అన్నిరకాల కరోనా వైరస్‌ ప్రొటీన్లకు అంటుకుపోయి, వైరస్ కణాల్లోకి విస్తరించకుండా చేస్తుంది. అంటే వేరియంట్లతో పనిలేకుండా అన్నిరకాల కరోనా వైరస్ లను అడ్డుకోలదన్నమాట. ఈ యాంటీబాడీని సూపర్ యాంటీ బాడీ అని పిలుస్తున్నారు.

ఈ సూపర్ యాంటీ బాడీ అన్ని రకాల వైరస్‌ వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తోందని వారు అంటున్నారు. కరోనా వేరియంట్లలో కొన్ని రకాలు యాంటీబాడీల పట్టు నుంచీ తప్పించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాయి. అయితే ఈ సూపర్ యాంటీబాడీతో ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. అన్నిరకాల వైరస్ లను కణాల్లోకి ఎంటర్ అవ్వకుండా అడ్డుకోవచ్చు. ఈ యాంటీబాడీ సక్సెస్ అయితే ఇక వేరింయంట్ల భయం కూడా ఉండదు. అన్నిరకాల వైరస్‌లకు ఒకే టీకా, ఒకే చికిత్స పనిచేసేలా చేయొచ్చు.

First Published:  20 July 2021 8:54 AM IST
Next Story