హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్?
సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీచేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఎందరో విద్యార్థులకు ఆయన మెరుగైన శిక్షణ అందించారు. ఆయన స్వేరోస్ అనే ఓ సంస్థను కూడా నెలకొల్పారు. అంబేద్కర్, పూలే ఆశయసాధన కోసం పనిచేస్తానంటూ ఆయన ప్రకటించారు. ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరోస్ సంస్థలో రాష్ట్రవ్యాప్తంగా సభ్యులు […]
సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీచేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఎందరో విద్యార్థులకు ఆయన మెరుగైన శిక్షణ అందించారు. ఆయన స్వేరోస్ అనే ఓ సంస్థను కూడా నెలకొల్పారు. అంబేద్కర్, పూలే ఆశయసాధన కోసం పనిచేస్తానంటూ ఆయన ప్రకటించారు.
ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరోస్ సంస్థలో రాష్ట్రవ్యాప్తంగా సభ్యులు ఉన్నారు. గురుకుల పూర్వ విద్యార్థులతో ఆయన ఈ సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. సమర్థుడైన అభ్యర్థి కోసం వెదుకుతున్నది. బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీచేస్తుండటంతో ఆయనకు దీటుగా అభ్యర్థిని నిలబెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరి .. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్‌లో ఉండగానే.. ఆయనకు సంబంధించిన ఆడియో కాల్ లీక్ అయ్యింది. దీంతో కౌశిక్ రెడ్డి ఇమేజ్ దెబ్బతిన్నది. ఈ క్రమంలో కౌశిక్‌కు టికెట్ ఇస్తే నష్టం వాటిల్లుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. మరోవైపు ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన ఎల్ రమణకు టికెట్ ఇస్తారన్న టాక్ కూడా వినిపించింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ దళితులకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా దళిత బంధు అనే ఓ పథకానికి శ్రీకారం చుట్టారు. తాజాగా దళిత వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వాలని .. గులాబీ బాస్ భావిస్తున్నారని సమాచారం.
ప్రవీణ్‌కుమార్.. హుజూరాబాద్‌కు స్థానికేతరుడు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ ప్రవీణ్‌కుమార్ నియోజకవర్గం. అయితే గతంలో ఆయన కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావాలని కేసీఆర్ భావించారని టాక్. రాజకీయాల్లోకి రావడం పట్ల ప్రవీణ్‌కుమార్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.