Telugu Global
NEWS

ఏపీపై సవతిప్రేమ చూపిస్తున్న కేంద్రం..!

కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం చేసి ఎనిమిదేళ్లు కావొస్తున్నా చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ మాట తప్పిందని ఆరోపించారు. పుదుచ్చేరిలో ఎన్నికలు ఉండటంతో అక్కడ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన […]

ఏపీపై సవతిప్రేమ చూపిస్తున్న కేంద్రం..!
X

కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం చేసి ఎనిమిదేళ్లు కావొస్తున్నా చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ మాట తప్పిందని ఆరోపించారు. పుదుచ్చేరిలో ఎన్నికలు ఉండటంతో అక్కడ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం .. ఏపీకి మాత్రం మొండి చేయి చూపిస్తోందని మండిపడ్డారు.

‘ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉంటే వాటిని లాభాల బాట పట్టించాలి. అంతేకానీ వాటిని ప్రైవేటుకు అమ్ముకోవడం ఏమిటి? దిశ బిల్లును క్లియర్‌ చేయాలని కోరాం. సీఆర్డీఏ, ఏపీ ఫైబర్‌, రథం తగలబడ్డ అంశాలపై సీబీఐ విచారణ కోరాం’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం విషయంలోనూ స్పీకర్​ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడం విషయంలోనూ కేంద్రం జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించినట్టు మరో ఎంపీ మిథున్​రెడ్డి పేర్కొన్నారు.

ఇటీవల ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారంపై వైఎస్సార్​సీపీ ఎంపీలు వరసగా స్పీకర్​కు ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్లు కోరుతున్నారు. అయితే ఈ అంశంపై స్పీకర్​ ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ విషయాన్ని ఎంపీ విజయ్​సాయిరెడ్డి అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించారు.

First Published:  18 July 2021 2:00 PM IST
Next Story