హుజూరాబాద్‌లో జమున పోటీ? నిజమేనా
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ఇంకా అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. కానీ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన సతీమణి ఈటల జమున కూడా హుజూరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే అక్కడ ఈటల రాజేందర్ పోటీచేస్తారా? లేక ఆయన సతీమణి పోటీచేస్తారా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొన్నది. ఈటల జమున ముమ్మరంగా హుజూరాబాద్‌లో పర్యటిస్తుండటంతో […]
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ఇంకా అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. కానీ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన సతీమణి ఈటల జమున కూడా హుజూరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే అక్కడ ఈటల రాజేందర్ పోటీచేస్తారా? లేక ఆయన సతీమణి పోటీచేస్తారా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొన్నది.
ఈటల జమున ముమ్మరంగా హుజూరాబాద్‌లో పర్యటిస్తుండటంతో ఈ సారి జమున పోటీలో ఉంటారని .. వార్తలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ జాతీయ స్థాయిలో పదవి తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈటల జమున మీడియాతో మాట్లాడారు. ‘ ప్రభుత్వం మా మీద కక్ష గట్టింది. కనీసం ఫ్లెక్సీలు కూడా పెట్టుకోనివ్వడం లేదు. ఎవరెన్ని కుట్రలు చేసిన ఇక్కడ గెలిచేది మేమే’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎవరు పోటీచేయాలి? అన్న విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని ఆమె పేర్కొన్నారు. తాను పోటీ చేసినా, తన భర్త పోటీ చేసినా గుర్తు మాత్రం ఒకటే ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
ఇక్కడ ఈటల రాజేందర్ బీసీ కార్డు ప్రయోగించబోతున్నారని తెలిసి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అందుకనుగుణంగా వ్యూహాలకు పదును పెట్టారు. టీటీడీపీ అధ్యక్షుడు రమణను తన పార్టీలోకి తెచ్చుకొని అక్కడ పోటీగా నిలపాలని భావిస్తున్నారు. రమణ బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఈటలకు పోటీగా ఆయనను దించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ ఆయన సతీమణి జమున ను రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఆమె రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్లో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ టికెట్ పాడి కౌశిక్‌రెడ్డికి ఇస్తారా? లేక ఎల్. రమణకు ఇస్తారా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కు ఇస్తారా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈటలకు దీటైన నేతను రంగంలోకి దించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.