Telugu Global
Cinema & Entertainment

శరవేగంగా గోపీచంద్ సినిమా షూటింగ్

ప్ర‌తి రోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌ వ‌రుకు అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌నల‌ను సైతం ద‌ర్శ‌కుడు మారుతి […]

శరవేగంగా గోపీచంద్ సినిమా షూటింగ్
X

ప్ర‌తి రోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా
కమర్షియల్. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి నిర్మిస్తున్న సినిమా
ఇది. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌ వ‌రుకు అందరి నుంచి మంచి
రెస్పాన్స్ వచ్చింది. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌నల‌ను సైతం ద‌ర్శ‌కుడు
మారుతి త‌న‌దైన శైలిలో విడుద‌ల చేస్తూ వచ్చాడు.

ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే.. పక్కా కమర్షియల్ సినిమా ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్
పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాలతో పాటు, అల్లు స్టూడియోస్, అన్న‌పూర్ణ
స్టూడియోల్లో షూటింగ్ జ‌రుగుతుంది. తాజా సమాచారం ప్రకారం.. వచ్చేనెల రెండో వారానికి షూటింగ్
పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండబోతోంది. ఇప్పుటికే విడుదలైన పోస్టర్లలో కూడా
గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ
సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు.. జ‌ేక్స్ బీజాయ్
సంగీతాన్ని అందిస్తున్నాడు..

First Published:  18 July 2021 11:41 AM IST
Next Story