Telugu Global
Cinema & Entertainment

పుకార్లు ఖండించిన టక్ జగదీశ్

నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాకు సంబంధించి 2 రోజులుగా ఓ పుకారు నడుస్తోంది. ఎట్టకేలకు ఆ రూమర్ పై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ పుకారు ఏంటో చూద్దాం. టక్ జగదీష్ సినిమాను ఈనెల 30కే విడుదల చేస్తారట. వచ్చే వారం నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తారట. ఇదీ ఆ ప్రచారం. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. ఇలాంటి టైమ్ లో టక్ జగదీష్ రిలీజ్ అనే ప్రచారం జరగడంతో […]

పుకార్లు ఖండించిన టక్ జగదీశ్
X

నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాకు సంబంధించి 2 రోజులుగా ఓ పుకారు నడుస్తోంది. ఎట్టకేలకు
ఆ రూమర్ పై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ పుకారు ఏంటో చూద్దాం.

టక్ జగదీష్ సినిమాను ఈనెల 30కే విడుదల చేస్తారట. వచ్చే వారం నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తారట. ఇదీ
ఆ ప్రచారం. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. ఇలాంటి టైమ్ లో టక్
జగదీష్ రిలీజ్ అనే ప్రచారం జరగడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఈ ప్రచారాన్ని యూనిట్
ఖండించింది.

ఈనెల 30న టక్ జగదీష్ రిలీజ్ అవ్వడం లేదని క్లారిటీ ఇచ్చింది యూనిట్. తమ సినిమా ఎప్పుడు రిలీజ్
అవుతుందనే విషయాన్ని తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని,
అప్పటివరకు ఎలాంటి పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. నాని-రీతూవర్మ హీరోహీరోయిన్లుగా
నటించిన ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకొని, ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. శివ నిర్వాణ ఈ సినిమాకు
దర్శకుడు.

First Published:  17 July 2021 2:53 PM IST
Next Story