Telugu Global
Cinema & Entertainment

నివేత పాత్ర నిడివి పెరిగింది

రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో హీరోయిన్ సాయిపల్లవితో పాటు చాలామంది మహిళా నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లలో ప్రియమణి, నివేత పెతురాజ్ కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్లలో నివేత పెతురాజ్ పాత్ర నిడివిని పెంచాలని నిర్ణయించారు. సినిమాలో రానా నక్సలైట్ రవన్నగా కనిపించబోతున్నాడు. ఆమె అనుచరురాలిగా, మరో నక్సల్ పాత్రలో నివేత పెతురాజ్ కనిపించనుంది. ఈ పాత్రకు సినిమాలో మంచి స్కోప్ ఉంది. పైగా ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పార్ట్ మొత్తం చూసుకుంటే, నివేత […]

నివేత పాత్ర నిడివి పెరిగింది
X

రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో హీరోయిన్ సాయిపల్లవితో పాటు చాలామంది మహిళా
నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లలో ప్రియమణి, నివేత పెతురాజ్ కూడా ఉన్నారు. ఇప్పుడు
వీళ్లలో నివేత పెతురాజ్ పాత్ర నిడివిని పెంచాలని నిర్ణయించారు.

సినిమాలో రానా నక్సలైట్ రవన్నగా కనిపించబోతున్నాడు. ఆమె అనుచరురాలిగా, మరో నక్సల్ పాత్రలో
నివేత పెతురాజ్ కనిపించనుంది. ఈ పాత్రకు సినిమాలో మంచి స్కోప్ ఉంది. పైగా ఇప్పటివరకు జరిగిన
షూటింగ్ పార్ట్ మొత్తం చూసుకుంటే, నివేత పాత్రను ఇంకాస్త పెంచితే బాగుంటుందని అంతా ఫీలయ్యారు.

దీంతో నివేత పాత్రను ఇంకాస్త పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం విరాటపర్వం సినిమాకు సంబంధించి
కొత్త షెడ్యూల్ మొదలైంది. రానా, సాయిపల్లవితో పాటు నివేత పెతురాజ్ పై కొన్ని సన్నివేశాలు
చిత్రీకరిస్తున్నారు.

First Published:  17 July 2021 2:48 PM IST
Next Story