Telugu Global
NEWS

యడ్డీ రాజీనామా? మరోసారి హాట్​టాపిక్​

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తన పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కొందరు బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. ఈ మేరకు వారు బహిరంగంగా కూడా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజకీయ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అధిష్ఠానం నిర్ణయానికి తలొగ్గి ప్రస్తుతం ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఏదో ఒకరోజు పార్టీలో అగ్గి రాజుకుంటుందని హైకమాండ్​కు కూడా తెలుసు. ఇదిలా ఉంటే తాజాగా సీఎం యడియూరప్ప […]

యడ్డీ రాజీనామా? మరోసారి హాట్​టాపిక్​
X

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తన పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కొందరు బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. ఈ మేరకు వారు బహిరంగంగా కూడా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజకీయ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అధిష్ఠానం నిర్ణయానికి తలొగ్గి ప్రస్తుతం ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఏదో ఒకరోజు పార్టీలో అగ్గి రాజుకుంటుందని హైకమాండ్​కు కూడా తెలుసు.

ఇదిలా ఉంటే తాజాగా సీఎం యడియూరప్ప ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో మరోసారి ఆయన రాజీనామా అంశం తెరమీదకు వచ్చింది. ఆయన ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. కర్ణాటక అభివృద్ధి, పలు ప్రాజెక్టులు, క్యాబినేట్​ పునర్వ్యస్థీకరణ గురించి చర్చించినట్టు యడియూరప్ప మీడియాకు తెలిపారు. కానీ ఆయన వద్ద బీజేపీ పెద్దలు రాజీనామా అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చినట్టు సమాచారం. బీజేపీలో ఉన్న నిబంధన ప్రకారం.. 75 ఏళ్లు పైబడిన వారు రాజకీయాలనుంచి తప్పుకోవాలి. కానీ కర్ణాటకలో యడియూరప్ప కోసం ఈ నిర్ణయాన్ని సడలించారు. ప్రస్తుతం యడియూరప్ప వయసు 79 ఏళ్లు. దీంతో ఆయన పదవి నుంచి తప్పుకొని కొత్త వారికి అవకాశం కల్పించాలన్న డిమాండ్​ తెరమీదకు వస్తున్నది.

ఈ క్రమంలో యడియూరప్ప కూడా రాజీనామా చేసేందుకు ఒప్పుకున్నట్టు నేషనల్​ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాను రాజీనామాకు సిద్ధమని ఆయన ప్రధాని వద్ద అన్నారట. అయితే తన కుమారులకు జాతీయ స్థాయిలో ఏదైనా కీలక పదవులు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారట. సాధారణంగా బీజేపీ వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో యడ్డీ కుమారుడికి పదవులు ఇస్తే.. రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కానీ యడ్డీ ప్రతిపాదనను పక్కకు పెడితే.. కర్ణాటకలో ఆయన సామాజికవర్గం నొచ్చుకొనే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో? వేచి చూడాలి.

First Published:  17 July 2021 1:12 PM IST
Next Story