Telugu Global
NEWS

పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి అరెస్ట్​.. ఇందిరాపార్క్​ వద్ద టెన్షన్​

పెట్రో, డీజిల్​ ధరలు పెరిగినందుకు నిరసనగా కాంగ్రెస్​ పార్టీ ఇవాళ చలో రాజ్​భవన్​కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కేవలం ఇందిరాపార్క్​ వద్ద 200 మందితో సమావేశం నిర్వహించుకొనేందుకు మాత్రమే పోలీసులు పర్మిషన్​ ఇచ్చారు. అయితే రేవంత్​రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చలో రాజ్​భవన్​ నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇవాళ ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఇందిరా పార్క్​ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్​ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇందిరాపార్క్​కు […]

పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి అరెస్ట్​.. ఇందిరాపార్క్​ వద్ద టెన్షన్​
X

పెట్రో, డీజిల్​ ధరలు పెరిగినందుకు నిరసనగా కాంగ్రెస్​ పార్టీ ఇవాళ చలో రాజ్​భవన్​కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కేవలం ఇందిరాపార్క్​ వద్ద 200 మందితో సమావేశం నిర్వహించుకొనేందుకు మాత్రమే పోలీసులు పర్మిషన్​ ఇచ్చారు. అయితే రేవంత్​రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చలో రాజ్​భవన్​ నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇవాళ ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఇందిరా పార్క్​ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్​ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇందిరాపార్క్​కు వచ్చేందుకు కాంగ్రెస్​ కార్యకర్తలు బయలుదేరారు.

అయితే పోలీసులు ఎక్కడికక్కడ వారిని అరెస్ట్​ చేశారు. మరోవైపు ఇందిరాపార్క్​ వద్ద నిర్వహించిన సమావేశం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్​ కార్యకర్తలు మాత్రం బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు.

మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కార్యకర్తల సాయంతో బారికేడ్ల నుంచి బయటకు వెళ్లారు. అక్కడి నుంచి రేవంత్​రెడ్డి, మధుయాష్కి గౌడ్​, అంజన్​కుమార్​ యాదవ్​ తదితరులు ర్యాలీగా బయలుదేరారు. దీంతో పోలీసులు ముగ్గురు నేతలను అరెస్ట్​ చేశారు. మరోవైపు కాంగ్రెస్​ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలీసులు టీఆర్​ఎస్​ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఓ కాంగ్రెస్​ కార్యకర్తను పోలీసులు చాలా దూరం పరిగెత్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రేవంత్​రెడ్డి తన ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. పోలీసులు కాంగ్రెస్​ కార్యకర్తలపై దమనకాండ సాగిస్తున్నారంటూ రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

First Published:  16 July 2021 7:18 AM GMT
Next Story