Telugu Global
NEWS

నాకు ఏ ఇబ్బందులూ లేవు.. తప్పుడు ప్రచారం ఆపండి..! ఎర్రన్న ఫైర్​..!

మీడియా, సోషల్ మీడియాపై ప్రముఖ నటుడు ఆర్​. నారాయణమూర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం కట్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలపై ఆర్​. నారాయణ మూర్తి రైతన్న అనే ఓ సినిమాను తీశారు. ఈ మూవీ ప్రీరిలీజ్​ ఫంక్షన్ ఇటీవల నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో ప్రజా గాయకుడు గద్దర్​ మాట్లాడుతూ.. ఆర్​.నారాయణ మూర్తి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సినిమాలు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి. ఆర్​. […]

నాకు ఏ ఇబ్బందులూ లేవు.. తప్పుడు ప్రచారం ఆపండి..! ఎర్రన్న ఫైర్​..!
X

మీడియా, సోషల్ మీడియాపై ప్రముఖ నటుడు ఆర్​. నారాయణమూర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం కట్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలపై ఆర్​. నారాయణ మూర్తి రైతన్న అనే ఓ సినిమాను తీశారు. ఈ మూవీ ప్రీరిలీజ్​ ఫంక్షన్ ఇటీవల నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో ప్రజా గాయకుడు గద్దర్​ మాట్లాడుతూ.. ఆర్​.నారాయణ మూర్తి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సినిమాలు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి.

ఆర్​. నారాయణమూర్తి ఆర్థికంగా చితికిపోయారని.. ఆయన అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారని కథనాలు రాశాయి. దీంతో నారాయణమూర్తికి ఆయన అభిమానులు,స్నేహితులు వరుసగా ఫోన్లు చేశారట. విదేశాల్లో ఉంటున్న ఆయన అభిమానులు కూడా స్పందించి సాయం చేస్తాం.. అకౌంట్ నంబర్​ ఇవ్వడంటూ ఫోన్లు చేశారట.

దీంతో ఆర్​. నారాయణ మూర్తి స్పందించారు. ’ నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో లేను. నాకు ఎవరూ సాయం చేయాల్సిన అవసరం లేదు. సామాన్యుడిగా జీవించడం.. హైదరాబాద్​కు దూరంగా పల్లె ప్రాంతంలో ఉండటం నా జీవన విధానం. నా మీద తప్పుడు ప్రచారం చేయకండి. ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది వస్తే .. సాయం చేసేందుకు ఎంతో మంది సన్నిహితులు ఉన్నారు. ఆటోలో ప్రయాణించడం.. చిన్న చిన్న హోటల్​లో బస చేయడం నా జీవన విధానంలో భాగం.

ప్రస్తుతం నేను హైదరాబాద్​కు దూరంగా ఉంటున్నాను. అక్కడి నుంచి ప్రతిరోజు ప్రసాద్​ ల్యాబ్​కు వచ్చేందుకు రూ. 1000 ఖర్చు పెట్టుకొని.. ఆటోలో వస్తున్నాను. అంటే నాకు నెలకు సగటున రూ. 30,000 ఖర్చవుతుంది. ఈ డబ్బుతో నేను జూబ్లీహిల్స్​లో అద్దె ఇంట్లో ఉండలేనా’ అంటూ ఆర్​.నారాయణ మూర్తి అన్నారు. దయచేసి తన మీద దుష్ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కొన్ని యూట్యూబ్​ చానల్స్​, కొన్ని వెబ్​సైట్లు తన మీద తప్పుడు ప్రచారం చేశాయని,ఇది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

First Published:  16 July 2021 6:18 AM IST
Next Story