ఇంటర్నెట్ @ ఎనీ టైమ్.. ఎనీ ప్లేస్..
భూమిపై ఎనీటైమ్, ఎనీ ప్లేస్ ఇంటర్నెట్ ఉండేలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలలా ఇంటర్నెట్ సిగ్నల్స్ అందేలా మనదేశానికి చెందిన ఓ కంపెనీ భారీగా కృషి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ వివరాలేంటంటే.. లండన్ కేంద్రంగా పనిచేసే వన్‌వెబ్ కంపెనీ ప్రపంచ నలుమూలలా ఇంటర్నెట్ ఉండేలా ఓ ప్రాజెక్ట్ పై పని చేస్తుంది. కానీ కొన్నికారణాల వల్ల ఆ కంపెనీ దివాళా తీసే పరిస్థితి రావడంతో వన్ వెబ్ కంపెనీని ఇండియాలోని భారతీ ఎంటర్ ప్రైజెస్ కొనుగోలు చేసింది. […]
భూమిపై ఎనీటైమ్, ఎనీ ప్లేస్ ఇంటర్నెట్ ఉండేలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలలా ఇంటర్నెట్ సిగ్నల్స్ అందేలా మనదేశానికి చెందిన ఓ కంపెనీ భారీగా కృషి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ వివరాలేంటంటే..
లండన్ కేంద్రంగా పనిచేసే వన్‌వెబ్ కంపెనీ ప్రపంచ నలుమూలలా ఇంటర్నెట్ ఉండేలా ఓ ప్రాజెక్ట్ పై పని చేస్తుంది. కానీ కొన్నికారణాల వల్ల ఆ కంపెనీ దివాళా తీసే పరిస్థితి రావడంతో వన్ వెబ్ కంపెనీని ఇండియాలోని భారతీ ఎంటర్ ప్రైజెస్ కొనుగోలు చేసింది. భూగోళం మీద ఎక్కడైనా ఆన్‌లైన్ సేవలు అందుకునేలా, కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్‌ను వినియోగించేలా శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ ను అందిచడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం.
మామూలుగా ఇంటర్నెట్ సదుపాయం కావాలంటే దానికోసం కేబుల్స్, టవర్స్ లాంటివి ఏర్పాటు చేయాలి. ఇవి లేకుండా ఇంటర్నెట్ సిగ్నల్ అందడం కష్టం. అయితే ప్రపంచంలోని ప్రతీ చోట ఇలా కేబుల్స్ లేదా టవర్లు నిర్మించడం కుదిరేపని కాదు. అందుకే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేలా ఓ కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. దీనికోసం మొదటి దశలో150 కిలోల బరువున్న 648 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాకు చెందిన ఓ కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో వీటిని అంతరిక్షంలోకి చేరుస్తోంది.
ఈ శాటిలైట్లను భూమికి 1,200 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ‘లో ఎర్త్ ఆర్బిట్’లో మోహరించేలా చేస్తారు. ఈ శాటిలైట్లు పంపే ఇంటర్నెట్ సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకునేందుకు మనం యాంటీనా లాంటి రిసీవర్ ను వాడాల్సి ఉంటుంది. అంటే ఇకపై ఇంటర్నెట్ తీరుతెన్నులన్నీ మారిపోబోతున్నాయన్నమాట. ఈ టెక్నాలజీతో నౌకలు, విమానాలు, ఐసోలేటెడ్ ఐల్యాండ్స్, పర్వతాలు, దట్టమైన అడవుల్లో కూడా నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు.