ఛత్రపతి మళ్లీ మొదలైంది
హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేషన్‌లో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. అగ్ర దర్శకుడు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’కి ఇది హిందీ రీమేక్. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, వి.వి.వినాయక్, నిర్మాత ధవల్ జయంతిలాల్ గడ సహా ముఖ్య అతిథులుగా రాజమౌళి, సుకుమార్ తదితరులు […]
హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో
సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేషన్‌లో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈరోజు
లాంఛనంగా ప్రారంభమైంది. అగ్ర దర్శకుడు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్
మూవీ ‘ఛత్రపతి’కి ఇది హిందీ రీమేక్.
హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, వి.వి.వినాయక్, నిర్మాత
ధవల్ జయంతిలాల్ గడ సహా ముఖ్య అతిథులుగా రాజమౌళి, సుకుమార్ తదితరులు హాజరయ్యారు.
ముహూర్తపు సన్నివేశానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టగా, రమా రాజమౌళి కెమెరా స్విచ్
ఆన్ చేశారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. మేకర్స్ స్టార్ రైటర్
విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్‌ను అందించారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నార్త్ లో కూడా పాపులర్. ఆయన నటించిన పలు చిత్రాలు హిందీలో
అనువాదమై యూ ట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్‌ను దక్కించుకున్నాయి. ఇదే ఆదరణ కారణంగానే
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. బాహుబలితో చరిత్ర
సృష్టించిన ప్రభాస్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నాడు.