ఈటలపై మంత్రి కేటీఆర్ విసుర్లు..!
ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు రావడం.. ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించడం చకచకా జరిగిపోయాయి. ఈటల కూడా టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఇదిలాఉంటే త్వరలో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అప్పుడే అన్ని రాజకీయపార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించనప్పటికీ ఆ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా […]
ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు రావడం.. ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించడం చకచకా జరిగిపోయాయి. ఈటల కూడా టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఇదిలాఉంటే త్వరలో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అప్పుడే అన్ని రాజకీయపార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించనప్పటికీ ఆ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఇంత వరకు పెద్దగా స్పందించలేదు. తాజాగా కేటీఆర్ ఈటల వ్యవహారంపై మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికపై కూడా స్పందించారు. ‘ ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎంతో చేసింది. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చింది. అన్ని విధాలా గౌరవించింది. కానీ ఆయన మాత్రం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. మంత్రి వర్గ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే అంతర్గత సమావేశాల్లో చర్చించాలి. కానీ బహిరంగ వేదికలమీద ఎలా మాట్లాడతారు.. ప్రస్తుతం హుజూరాబాద్‌లో జరిగిన అభివృద్ధి అంతా టీఆర్ఎస్ హయాంలో జరిగిందే. దాన్ని ఈటల తన ఖాతాలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక హుజూరాబాద్‌లో సాగేది వ్యక్తుల మధ్య పోటీ కాదు. పార్టీల మధ్య పోటీ.ఇక్కడ టీఆర్ఎస్ గెలుపొంది తీరుతుంది.
ఈటల ను టీఆర్ఎస్లో కొనసాగించేందుకు అనేక రకాలుగా ప్రయత్నించినా.. ఆయన మాత్రం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు నిరుద్యోగ సమస్య మాత్రమే ఉంది’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తారు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన పాడి కౌశిక్‌రెడ్డి, టీడీపీ నుంచి వచ్చిన ఎల్ రమణ టికెట్ ఆశిస్తున్నట్టు టాక్. టీఆర్ఎస్ మాత్రం అధికారికంగా పేరు ప్రకటించలేదు.