ఏపీలో టెన్త్ విద్యార్థులకు అన్యాయం జరగనట్టే..!
కరోనా కాలంలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పరీక్షలు ఉంటాయో లేదో తెలియని సందిగ్ధంలో చదవాలో సరదాగా గడపాలో తెలియక సతమతమయ్యారు విద్యార్థులు. ఆల్ పాస్ అని స్టేట్ మెంట్ ఇచ్చి, కరోనా బ్యాచ్ అంటూ ముద్ర వేసి.. మార్కులు, గ్రేడ్లు ఇవ్వకుండా జస్ట్ సర్టిఫికెట్ చేతిలో పెట్టడం ప్రభుత్వాలకు సులభమైన పని. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించి మార్కుల జాబితా చేతిలో పెట్టాలని చివరి వరకు ప్రయత్నించింది. అది […]
కరోనా కాలంలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పరీక్షలు ఉంటాయో లేదో తెలియని సందిగ్ధంలో చదవాలో సరదాగా గడపాలో తెలియక సతమతమయ్యారు విద్యార్థులు. ఆల్ పాస్ అని స్టేట్ మెంట్ ఇచ్చి, కరోనా బ్యాచ్ అంటూ ముద్ర వేసి.. మార్కులు, గ్రేడ్లు ఇవ్వకుండా జస్ట్ సర్టిఫికెట్ చేతిలో పెట్టడం ప్రభుత్వాలకు సులభమైన పని. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించి మార్కుల జాబితా చేతిలో పెట్టాలని చివరి వరకు ప్రయత్నించింది. అది సాధ్యం కాకపోవడంతో.. ఇప్పుడు పగడ్బందీగా మార్కుల కేటాయింపుకి అంతా సిద్ధం చేసింది. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ మార్కులను 70శాతం, టెన్త్ మార్కులను 30శాతం పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తున్నారు. ఇప్పుడు టెన్త్ విద్యార్థులకు కూడా గ్రేడ్లు ఇవ్వడానికి సమగ్ర నివేదిక సిద్దం చేశారు అధికారులు.
టెన్త్ విద్యార్థుల మార్కులకోసం ఛాయరతన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రకారం పదో తరగతిలో ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా పబ్లిక్ పరీక్షల మార్కుల్ని నిర్థారించబోతున్నారు. కరోనా ప్రభావం మొదలు కాకముందు ఏపీలో టెన్త్ విద్యార్థులకు రెండు ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహించారు. 50మార్కులకు గాను ఈ ఫార్మేటివ్ పరీక్షలు పెట్టారు. అయితే వీటిలో రాత పరీక్షకు 20మార్కులు, ప్రాజెక్ట్ రిపోర్ట్ లకు 10, నోట్ బుక్స్ లో హ్యాండ్ రైటింగ్ కి 10, క్లాస్ రూమ్ లో స్టూడెంట్ బిహేవియర్ కి 10 చొప్పున మార్కులు కేటాయించారు.
మార్కుల కేటాయింపు ఇలా..?
ఫార్మేటివ్ పరీక్షలో భాగంగా నిర్వహించిన రాత పరీక్షకు 70శాతం ప్రయారిటీ ఇస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్, హ్యాండ్ రైటింగ్, స్టూడెంట్ బిహేవియర్ వంటి వాటికి కేటాయించిన మార్కులకు 30శాతం ప్రయారిటీ ఇస్తారు. ఈ రెండిటినీ కలిపి విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారు. రెండు ఫార్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని కలిపి టెన్త్ లో గ్రేడ్లు ఇస్తారు.
గ్రేడ్లు.. ఇలా..
హిందీ మినహా మిగతా సబ్జెక్టుల్లో 91నుంచి 100లోపు మార్కులు వచ్చినవారికి ఏ-1 గ్రేడు ఇస్తారు. 10 గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు. 81 నుంచి 90లోపు మార్కులు వస్తే ఏ-2 గ్రేడ్, 9 గ్రేడ్ పాయింట్లు లభిస్తాయి. ఫార్మేటివ్ పరీక్షలకు హాజరు కాని వారి పరిస్థితి ఏంటనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రభుత్వ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా ఫార్మేటివ్ పరీక్షల్లో ఫెయిల్ చేసే పరిస్థితి లేదు. సో.. టెన్త్ క్లాస్ లో అందరూ పాస్ అయినట్టే లెక్క. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా ఇప్పుడు గ్రేడ్లు కూడా ఇవ్వబోతున్నారు.