కాంవడ్ వేడుకలకు అనుమతి.. యూపీ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..!
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయం ఏమిటంటే.. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంవడ్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శివభక్తులు గంగా జలాలను సేకరిస్తుంటారు. ఈ నెల 25 నుంచి యూపీలో కాంవడ్ ఉత్సవాలు చేసుకొనేందుకు యూపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడింది. ఓ వైపు దేశవ్యాప్తంగా థర్డ్‌వేవ్ వస్తుందని హెచ్చరికలు జారీ అవుతుంటే ఇటువంటి […]
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయం ఏమిటంటే.. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంవడ్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శివభక్తులు గంగా జలాలను సేకరిస్తుంటారు. ఈ నెల 25 నుంచి యూపీలో కాంవడ్ ఉత్సవాలు చేసుకొనేందుకు యూపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడింది.
ఓ వైపు దేశవ్యాప్తంగా థర్డ్‌వేవ్ వస్తుందని హెచ్చరికలు జారీ అవుతుంటే ఇటువంటి వేడుకలకు ఎందుకు అనుమతించారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు యూపీ సర్కార్‌కు నోటీసులు పంపించింది కోర్టు. మరోవైపు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం కాంవడ్ వేడుకలకు అనుమతి ఇవ్వలేదు.ఈ విషయమై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రలకు అనుమతి ఇస్తే.. కరోనా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు యూపీ మాత్రం కఠిన ఆంక్షలతో ఈ వేడుకలకు అనుమతి ఇచ్చింది.
దాదాపు 15 రోజులపాటు ఈ వేడుకలు సాగుతాయి. ప్రతి శివభక్తుడు కచ్చితంగా ఆర్టీపీసీర్ పరీక్షలు చేసుకోవాలని నిబంధన పెట్టింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకొని నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే.. వేడుకలకు అనుమతి ఇచ్చారు. ఇన్ని ఆంక్షలు విధించినప్పటికీ యూపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.
మరోవైపు తీర్థ క్షేత్రాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మతపరమైన కార్యక్రమాలకు కొంతకాలం బ్రేక్ ఇవ్వడం బెటర్ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీం నోటీసులు ఇచ్చిన నేపథ్యలో యూపీ సర్కార్ వేడుకల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.