Telugu Global
Cinema & Entertainment

ఈనెల 20న వస్తున్న నారప్ప

నారప్పను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేశారంటూ కొందరు వాదించారు. మరికొందరు మాత్రం ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడం కోసం ఆపారని, అందుకోసమే ఓటీటీ అగ్రిమెంట్లు కూడా కాన్సిల్ చేశారని వాదించారు. ఎట్టకేలకు ఈ వాదనలకు, ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈనెల 20న స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం.. నారప్ప సినిమాను 40 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ కు అమ్మేసినట్టు తెలుస్తోంది. […]

narappa-may-14-release
X

నారప్పను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేశారంటూ కొందరు వాదించారు. మరికొందరు మాత్రం ఈ
సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడం కోసం ఆపారని, అందుకోసమే ఓటీటీ అగ్రిమెంట్లు కూడా కాన్సిల్
చేశారని వాదించారు. ఎట్టకేలకు ఈ వాదనలకు, ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. నారప్ప సినిమా
అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈనెల 20న స్ట్రీమింగ్ కు రాబోతోంది.

తాజా సమాచారం ప్రకారం.. నారప్ప సినిమాను 40 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ కు అమ్మేసినట్టు
తెలుస్తోంది. అది కూడా నెల రోజుల కిందటే డీల్ ముగిసింది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తవ్వడంతో, ఇప్పుడు
ఏకంగా స్ట్రీమింగ్ డేట్ తో పోస్టర్ విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్.

కేవలం నారప్ప మాత్రమే కాదు, వెంకటేష్ నటించిన మరో సినిమా దృశ్యం-2 కూడా డైరక్ట్ ఓటీటీ రిలీజ్
కిందకు వెళ్లిపోయింది. డిస్నీ-హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా అన్ని రైట్స్ ను 36 కోట్ల రూపాయలకు
దక్కించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద వెంకీ అప్ కమింగ్ మూవీస్ రెండూ థియేటర్లలోకి రావడం
లేదన్నమాట.

First Published:  14 July 2021 3:22 AM IST
Next Story