ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం 25వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు..
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకోసం 25వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆర్డర్ ఇచ్చింది. దీనికి సంబంధించి కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) సంస్థతో రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (NREDCAP)తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతలో మొత్తం 25వేల స్కూటర్లు కొనుగోలు, నిర్వహణ కోసం ఈ ఒప్పందం కుదిరింది. గ్రీన్ డ్రైవ్ లో ఏపీ కీలకం.. దేశవ్యాప్తంగా శిలాజ ఇంధన వనరుల వినియోగం తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గ్రీన్ డ్రైవ్ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల […]
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకోసం 25వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆర్డర్ ఇచ్చింది. దీనికి సంబంధించి కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) సంస్థతో రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (NREDCAP)తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతలో మొత్తం 25వేల స్కూటర్లు కొనుగోలు, నిర్వహణ కోసం ఈ ఒప్పందం కుదిరింది.
గ్రీన్ డ్రైవ్ లో ఏపీ కీలకం..
దేశవ్యాప్తంగా శిలాజ ఇంధన వనరుల వినియోగం తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గ్రీన్ డ్రైవ్ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటోంది. కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ దిశగా ఏపీ తొలి అడుగు వేసింది. ప్రభుత్వం తరపున 25వేల స్కూటర్లు కొనుగోలు చేసి, వాటిని ఉద్యోగులకు అందించబోతోంది. దేశవ్యాప్త గ్రీన్ డ్రైవ్ లో ఈ పరిణామం కీలకంగా మారుతుందని అంటున్నారు CESL సంస్థ ఎండీ, సీఈఓ మహువా ఆచార్య. వాహనాల అమ్మకంతోపాటు, చార్జింగ్ స్టేషన్ల నిర్వహణకు కూడా తమ సంస్థ సహకారం అందిస్తుందని తెలిపారాయన.
ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందడుగు..
పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతో అవసరం అని, ప్రభుత్వమే ముందుకు రావడంతో ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని అన్నారు NREDCAP చైర్మన్ శ్రీకాంత్. పర్యావరణ పరిరక్షణతోపాటు, ఆర్థిక ప్రయోజనాలు కూడా దీనివల్ల ఉంటాయని తెలిపారాయన. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా రిబేటుపై వాహనాలు సరఫరా చేస్తామని తెలిపారు. సామాన్య ప్రజల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు ఇది తొలిమెట్టు అవుతుందని చెప్పారు.
ప్రభుత్వ రంగంలో ఎలక్ట్రిక్ వాహనా కొనుగోలు ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. 25వేల ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుకోసం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంలో గొప్ప ముందడుగు అని ఆయన అభివర్ణించారు.
ఉద్యోగులకు ఏ ప్రాతిపదికన ఇస్తారు..
ఎలక్ట్రిక్ వాహనాలను ఉద్యోగులకు లీజుపై ఇస్తారనే ప్రతిపాదన ఉంది. నెలవారీ లీజు పద్ధతిలో ఈ 25వేల వాహనాలను ఉద్యోగులకు కేటాయిస్తారు. ప్రతి నెలా లీజు మొత్తంతోపాటు, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ముని ఉద్యోగుల జీతాల్లోనుంచి ఈఎంఐ గా వసూలు చేస్తారు. మూడేళ్లపాటు ఈ వాహనాలకు గ్యారెంటీ ఉంటుంది. మూడేళ్ల కాలపరిమితి లేదా 60వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తయితే అప్పటి వరకు బ్యాటరీకి వారెంటీ ఉంటుంది.