అమిత్ షా పర్యటనలో ఇన్ని ఆంక్షలా? ఇది ప్రజాస్వామ్య దేశమేనా?
ఇటీవల అమిత్ షా అహ్మదాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని వెజల్పూర్ పరిధిలో అమిత్ షా ఓ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించేందుకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు అక్కడ కఠిన ఆంక్షలు విధించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆ కాలనీ ప్రజలంతా కిటికీలు, తలుపులు మూసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కాలనీలో అనౌన్స్మెంట్ చేశారు. ఓ సర్క్యూలర్ కూడా జారీ చేశారు. 300 […]
ఇటీవల అమిత్ షా అహ్మదాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని వెజల్పూర్ పరిధిలో అమిత్ షా ఓ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించేందుకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు అక్కడ కఠిన ఆంక్షలు విధించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆ కాలనీ ప్రజలంతా కిటికీలు, తలుపులు మూసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కాలనీలో అనౌన్స్మెంట్ చేశారు. ఓ సర్క్యూలర్ కూడా జారీ చేశారు.
300 ఇళ్లకు, ఐదు అపార్ట్మెంట్లకు నోటీసులు అందించారు. ఈ నోటీసులపై పంక్తి జోగ్ అనే ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు ఆస్తమా ఉందని.. అందుకే తాను కిటికీలు మూసి ఉండలేనంటూ ఆమె పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పంక్తి జోగ్ ఓ ఆర్టీఐ ఉద్యమకారిణి. ఆమె పోలీసుల తీరును తప్పుబడుతూ ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేసింది.
ఇది ప్రజాస్వామ్య దేశమేనా? హోంమంత్రి వస్తున్నాడని సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తారా? దుకాణాలు అన్ని క్లోజ్ చేస్తే .. ప్రజలు సరుకులు ఎలా తెచ్చుకుంటారు? ఇది ప్రజల హక్కులను హరించడమే.. అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు ఆమెకు పలువురు మద్దతు తెలిపారు. అయితే వెజల్పూర్ పోలీసుల వాదన మరోలా ఉంది. జెడ్ క్యాటగిరీ భద్రతలో భాగంగా అలా చేశామని పోలీసులు చెప్పుకొచ్చారు. అంతేకాక తాము ఎవరినీ బలవంతం చేయలేదని వారు పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఓ వైపు ప్రతిపక్షాలు, మరో వైపు మీడియా అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసుల తీరును తప్పుబట్టాయి. ప్రజల హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదని ప్రజాస్వామిక వాదులు అభిప్రాయపడుతున్నారు.