Telugu Global
Others

వర్షాకాలంలో ఇవి తినకండి

వర్షాకాలం రోగాలకు నెలవు. మిగతా సీజన్ల కంటే ఈ సీజన్ లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని ఆహారపదార్ధాలకు దూరంగా ఉంటే మంచిది. అవేంటంటే.. వర్షాకాలంలో సులువుగా జీర్ణం అయ్యే ఆహరం తీసుకోవడం మంచిది. అంటే తాజా కూరగాయలు, పండ్లు లాంటివన్నమాట. ఈ సీజన్ లో వీలైనంత వరకూ జంక్ ఫుడ్ ను పక్కన పెట్ట‌డం ఉత్తమం. పిజ్జాలు, బర్గర్లు, వేపుళ్లు లాంటి పదార్థాలు తింటే అరుగుదల కష్టమవుతుంది. దాని వల్ల అనారోగ్య సమస్యలు […]

వర్షాకాలంలో ఇవి తినకండి
X

వర్షాకాలం రోగాలకు నెలవు. మిగతా సీజన్ల కంటే ఈ సీజన్ లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని ఆహారపదార్ధాలకు దూరంగా ఉంటే మంచిది. అవేంటంటే..

వర్షాకాలంలో సులువుగా జీర్ణం అయ్యే ఆహరం తీసుకోవడం మంచిది. అంటే తాజా కూరగాయలు, పండ్లు లాంటివన్నమాట. ఈ సీజన్ లో వీలైనంత వరకూ జంక్ ఫుడ్ ను పక్కన పెట్ట‌డం ఉత్తమం. పిజ్జాలు, బర్గర్లు, వేపుళ్లు లాంటి పదార్థాలు తింటే అరుగుదల కష్టమవుతుంది. దాని వల్ల అనారోగ్య సమస్యలు రావొచ్చు. అందుకే వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే వర్షాకాలంలో కారాన్ని కూడా వీలైనంత తగ్గిస్తే మంచిది.

వర్షాలు కురిసే సమయంలో చేపలు, రొయ్యలు లాంటివి తినడం వల్ల టైఫాయిడ్, జాండీస్, డయేరియా లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వాటిని తగ్గిస్తే మంచిది. ఇకపోతే వర్షాకాలంలో ఎలర్జీ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. అందుకే ఎలర్జీ, జలబు, దగ్గు, మైగ్రేన్, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు, ఆస్తమా లాంటి సమస్యలున్నవారు ఈ కాలంలో పాల ఉత్పత్తులు, కారం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

First Published:  13 July 2021 3:05 AM GMT
Next Story