Telugu Global
Cinema & Entertainment

సెట్స్ పైకొచ్చిన రామ్ సినిమా

కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు , తమిళ్ భాషల్లో సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుండి హైదరాబాద్ లో మొదలైంది. గండిపేటలో ప్రస్తుతం రామ్ మిగతా నటీనటులపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. లింగుస్వామి స్టయిల్ రాబోతున్న ఈ సినిమాలో రామ్ 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటివలే రామ్, హీరోయిన్ కృతిలపై ఓ […]

సెట్స్ పైకొచ్చిన రామ్ సినిమా
X

కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు , తమిళ్ భాషల్లో సినిమా చేస్తున్నాడు రామ్. ఈ
సినిమా షూటింగ్ ఈరోజు నుండి హైదరాబాద్ లో మొదలైంది. గండిపేటలో ప్రస్తుతం రామ్ మిగతా
నటీనటులపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. లింగుస్వామి స్టయిల్ రాబోతున్న ఈ సినిమాలో రామ్ 2 డిఫరెంట్
గెటప్స్ లో కనిపించబోతున్నాడు.

సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటివలే రామ్, హీరోయిన్
కృతిలపై ఓ ఫోటో షూట్ చేశారు. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ని లింగుస్వామి బాగా రాసుకున్నాడని
సమాచారం. రామ్ తో పాటు హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా మంచి స్కోప్ ఉంటుందని తెలుస్తుంది. అందుకే
బిజీగా ఉన్నప్పటికీ కృతి డేట్స్ ఎడ్జెస్ట్ చేసింది.

శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్
కంపోజ్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి మాస్ సినిమాల తర్వాత రామ్ చేస్తున్న ఈ మాస్
యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

First Published:  12 July 2021 11:25 AM IST
Next Story