మరో మీటింగ్ పెడుతున్న రజనీకాంత్
ఒకప్పుడు రజనీకాంత్ మీటింగ్ పెడుతున్నాడంటే చాలా హంగామా నడిచేది. ఏ క్షణానైనా రాజకీయ పార్టీ ప్రకటిస్తాడని అంతా అనుకున్నారు. సూపర్ స్టార్ కూడా అందుకు తగ్గట్టే ఫీలర్లు వదులుతూ వచ్చారు. కానీ రోజులు గడిచేకొద్దీ రజనీకాంత్ విషయాన్ని పలచన చేసేశారు. తూచ్.. పార్టీ పెట్టడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పారు. అంతే.. ఆ క్షణం నుంచి అభిమానులతో మీటింగ్స్ ఆగిపోయాయి. అలా ఆగిపోయిన మీటింగ్ ఇప్పుడు మళ్లీ మొదలు కాబోతోంది. రేపు అభిమాన సంఘాలతో సమావేశం […]
ఒకప్పుడు రజనీకాంత్ మీటింగ్ పెడుతున్నాడంటే చాలా హంగామా నడిచేది. ఏ క్షణానైనా రాజకీయ పార్టీ
ప్రకటిస్తాడని అంతా అనుకున్నారు. సూపర్ స్టార్ కూడా అందుకు తగ్గట్టే ఫీలర్లు వదులుతూ వచ్చారు.
కానీ రోజులు గడిచేకొద్దీ రజనీకాంత్ విషయాన్ని పలచన చేసేశారు. తూచ్.. పార్టీ పెట్టడం లేదంటూ చావు
కబురు చల్లగా చెప్పారు. అంతే.. ఆ క్షణం నుంచి అభిమానులతో మీటింగ్స్ ఆగిపోయాయి.
అలా ఆగిపోయిన మీటింగ్ ఇప్పుడు మళ్లీ మొదలు కాబోతోంది. రేపు అభిమాన సంఘాలతో సమావేశం
కాబోతున్నారు రజనీకాంత్. మాట్లాడుకుందాం రమ్మంటూ తమిళనాట తన అభిమాన సంఘాలన్నింటికీ
సమాచారం అందించారు రజనీకాంత్. దీంతో మరోసారి అతడి పొలిటికల్ ఎంట్రీపై అనుమానాలు
గుప్పుమన్నాయి.
అయితే ఈసారి రజనీకాంత్ సమావేశానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. అతడి
అభిమానులు కూడా ఆ దిశగా పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఏదో తన ఆరోగ్య పరిస్థితి గురించో, అప్ కమింగ్
మూవీస్ గురించో, సామాజిక సేవ గురించో రజనీకాంత్ ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఉంది.