ఆచార్య నుంచి మరో పోస్టర్
ఆచార్య నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ వచ్చేశాయి. చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు కాజల్, పూజా హెగ్డే లుక్స్ కూడా వచ్చేశాయి. ఇప్పుడు వీటికి అదనంగా మరో స్టిల్ రిలీజ్ చేశారు. ఈసారి రామ్ చరణ్ సోలో స్టిల్ విడుదల చేశారు. ఆచార్య సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెబుతూ ఈ ఫొటో విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రధారిగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ […]
ఆచార్య నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ వచ్చేశాయి. చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు కాజల్, పూజా హెగ్డే
లుక్స్ కూడా వచ్చేశాయి. ఇప్పుడు వీటికి అదనంగా మరో స్టిల్ రిలీజ్ చేశారు. ఈసారి రామ్ చరణ్ సోలో
స్టిల్ విడుదల చేశారు. ఆచార్య సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెబుతూ ఈ ఫొటో విడుదలైంది.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రధారిగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ
ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ
చిత్రం 'ఆచార్య'. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు.
కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపిన యూనిట్.. ఇప్పుడు పరిస్థితులు
చక్కబడుతుండటంతో పునః ప్రారంభించారు. “రీసెంట్‌గా ‘ఆచార్య’ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్
చేశాం. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో షూటింగ్
పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను తెలియజేస్తాం.” అని చిత్ర
యూనిట్ ప్రకటించింది.