రేవంత్ టీడీపీ అయితే మీ నాన్న ఏంటి? ఎంపీ అరవింద్..!
రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావడంతో తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే దూకుడుగా వ్యవహరించే రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడయ్యాక అస్సలు తగ్గడం లేదు. కేసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. టీఆర్ఎస్ నుంచి అధికారం లాక్కొంటానని కూడా ప్రకటించారు. ఇక రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఆయనలో ఇంకా టీడీపీ రక్తం పోలేదని.. గతంలో సోనియాగాంధీని దయ్యం, భూతం అని అభివర్ణించి.. ఇప్పుడేమో తెలంగాణ తల్లి […]
రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావడంతో తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే దూకుడుగా వ్యవహరించే రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడయ్యాక అస్సలు తగ్గడం లేదు. కేసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. టీఆర్ఎస్ నుంచి అధికారం లాక్కొంటానని కూడా ప్రకటించారు.
ఇక రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఆయనలో ఇంకా టీడీపీ రక్తం పోలేదని.. గతంలో సోనియాగాంధీని దయ్యం, భూతం అని అభివర్ణించి.. ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నాడని.. త్వరలో చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ కూడా స్పందించారు. ఈ వాగ్వాదం ఇలా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే కేటీఆర్ వ్యాఖ్యలపై ఇవాళ ఆశ్చర్యకరంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీ మనిషి అయితే.. కేసీఆర్ కూడా టీడీపీ మనిషే కదా? దీనికేమంటావు కేటీఆర్? అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి.
కేటీఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌ను విమర్శిస్తే.. టీ కాంగ్రెస్ నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదు. రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు ఒకరిద్దరూ మాత్రమే ఈ వ్యాఖ్యలను ఖండించారు. కానీ కేటీఆర్ వ్యాఖ్యలను అరవింద్ ఖండించడం గమనార్హం.