వలసనేతలకు బీజేపీ జై.. మంత్రివర్గ విస్తరణపై శివసేన సెటైర్లు..
మోదీ మంత్రి వర్గ విస్తరణలో కొత్తగా 36మందికి చోటు లభించింది. విచిత్రం ఏంటంటే.. అందులో యాభైశాతం మందికి కూడా బీజేపీ నేపథ్యం లేదు. మిత్రపక్షాలకు, ఇతర పార్టీలనుంచి బీజేపీలోకి వలస వచ్చినవారికి మాత్రమే మోదీ పెద్దపీట వేశారు, వేయాల్సి వచ్చింది. సొంతపార్టీ నేతలకు ఉద్వాసన పలికి మరీ పక్క పార్టీనుంచి వచ్చినవారిపై మమకారం చూపించారు మోదీ. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మోదీ కేబినెట్ లో మంత్రి పదవులను నింపేందుకు […]
మోదీ మంత్రి వర్గ విస్తరణలో కొత్తగా 36మందికి చోటు లభించింది. విచిత్రం ఏంటంటే.. అందులో యాభైశాతం మందికి కూడా బీజేపీ నేపథ్యం లేదు. మిత్రపక్షాలకు, ఇతర పార్టీలనుంచి బీజేపీలోకి వలస వచ్చినవారికి మాత్రమే మోదీ పెద్దపీట వేశారు, వేయాల్సి వచ్చింది. సొంతపార్టీ నేతలకు ఉద్వాసన పలికి మరీ పక్క పార్టీనుంచి వచ్చినవారిపై మమకారం చూపించారు మోదీ. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
మోదీ కేబినెట్ లో మంత్రి పదవులను నింపేందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చినందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లకు బీజేపీ ధన్యవాదాలు తెలపాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మోదీకి చురకలంటించారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా వారిలో ముగ్గురికి బీజేపీ నేపథ్యం లేదని అన్నారు సంజయ్ రౌత్. మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే స్ధాయికి తగిన శాఖను కేటాయించలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కీలక శాఖలను నిర్వహించిన ఆయనకు, ఎంఎస్ఎంఈ మంత్రిగా చిన్న మధ్యతరహా పరిశ్రమల పునరుద్దరణ పెద్ద సవాల్ గా మారుతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కిన కపిల్ పాటిల్, భారతి పవార్ లు గతంలో ఎన్సీపీలో ఉన్నారని, నారాయణ్ రాణే గతంలో శివసేనతో పాటు, కాంగ్రెస్‌లో కూడా పనిచేశారని రౌత్ గుర్తుచేశారు.
మరోవైపు సోషల్ మీడియాలో కూడా మంత్రివర్గ విస్తరణపై ట్రోలింగ్ మొదలైంది. కొవిడ్ వారియర్, కొవిడ్ సైంటిస్ట్, కొవిడ్ బ్రిగేడర్ అంటూ.. తనకు తానే జబ్బలు చరుచుకున్న ప్రధాని మోదీ, దేశంలో కరోనాని సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పిన మోదీ.. ఆరోగ్య శాఖ మంత్రిని ఎందుకు తప్పించారంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. తప్పులు చేసింది మోదీ, బలిపశువుగా మారింది హర్షవర్దన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా కూడా.. పార్టీ మారినవారిని గుర్తు పెట్టుకుని మరీ పదవులివ్వాల్సిన దీన స్థితికి బీజేపీ చేరుకుందని విమర్శిస్తున్నారు.