మహాసముద్రం షూటింగ్ ముగిసింది
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మహాసముద్రం. ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. గత కొన్ని రోజులుగా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు మేకర్స్ దీంతో `మహా సముద్రం`మూవీ షూటింగ్ పూర్తయ్యింది. కథా రచయిత, దర్శకుడు అజయ్ భూపతికి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రతి క్యారెక్టర్‌కు ఎంతో ప్రామఖ్యత ఉండబోతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే విడుదలచేసిన శర్వానంద్, సిద్దార్ధ్, అదితిరావు హైదరి, అనూ ఇమాన్యూయేల్, జగపతిబాబు, […]
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మహాసముద్రం. ఏకే
ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. గత కొన్ని రోజులుగా
ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు మేకర్స్ దీంతో 'మహా సముద్రం'మూవీ
షూటింగ్ పూర్తయ్యింది.
కథా రచయిత, దర్శకుడు అజయ్ భూపతికి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రతి క్యారెక్టర్‌కు ఎంతో ప్రామఖ్యత
ఉండబోతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే విడుదలచేసిన శర్వానంద్, సిద్దార్ధ్, అదితిరావు హైదరి, అనూ ఇమాన్యూయేల్, జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ ఫస్ట్‌లుక్స్‌కి అన్ని వర్గాల ప్రేక్షకులనుండి
మంచి రెస్పాన్స్ వచ్చింది.
షూట్ పూర్తయిన సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈసారి శర్వానంద్, సిద్దార్థ్ కలిసి ఉన్న స్టిల్
విడుదల చేశారు. ఇద్దరు పిడికిలి బిగించి నవ్వుతూ ఉన్నఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అదితిరావు హైదరి,
అనూ ఇమాన్యూల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.