సీఎం కేసీఆర్‌తో ఎల్ రమణ భేటీ..! టీఆర్ ఎస్ లో చేరికకు రంగం సిద్ధం
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ.. టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖరారైంది. గురువారం రమణ.. తన మాజీ సహచరుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రమణను కేసీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారని ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులపై వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. రమణ టీడీపీని […]
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ.. టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖరారైంది. గురువారం రమణ.. తన మాజీ సహచరుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రమణను కేసీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారని ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులపై వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
రమణ టీడీపీని వీడబోతున్నారని.. టీఆర్ఎస్లో చేరబోతున్నారని చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన కేసీఆర్‌తో భేటీ కావడంతో ఆ వార్తలు నిజమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆహ్వానానికి రమణ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారట.
ఈ భేటీ అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియా మాట్లాడుతూ.. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు ఎంతో మేలు చేస్తోందని పేర్కొన్నారు. రమణ అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందని అందుకే ఆయనను పార్టీలోకి ఆహ్వానించారని చెప్పుకొచ్చారు.
హుజూరాబాద్ అభ్యర్థా? ఎమ్మెల్సీ ఆఫరా?
ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇక్కడ అప్పుడే రాజకీయ పార్టీలు ప్రచారం కూడా మొదలుపెట్టాయి. బీజేపీ అభ్యర్థిగా ఈటల రంగంలోకి దిగుతున్నారు. ఇక టీఆర్ఎస్ తన మంత్రులు, ఎమ్మెల్యేలతో నిత్యం హుజూరాబాద్ లో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరోక్షంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. దీంతో హుజూరాబాద్‌లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.
ఇదిలా ఉంటే హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. దీంతో అక్కడ రమణను అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన బీసీ కావడంతో ఆ అంశం కలిసి వస్తుందని భావిస్తున్నారట. దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. అయితే రమణకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ క్రమంలో రమణకు అవకాశం ఇవ్వబోతున్నారని టాక్. ఏం జరుగబోతున్నదో వేచి చూడాలి.