Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య హిందీ సినిమా స్టార్ట్

ఉన్నట్టుంది సడెన్ గా బాలీవుడ్ ప్రాజెక్టులో ల్యాండ్ అయ్యాడు నాగచైతన్య. అమీర్ ఖాన్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. అమీర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాలో కీలకమైన ఓ చిన్న పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్ కోసం నాగచైతన్యను తీసుకున్నారు. చైతూకు ఇదే తొలి బాలీవుడ్ మూవీ. ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు నాగచైతన్య. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. సినిమాలో అమీర్ ఖాన్, […]

నాగచైతన్య హిందీ సినిమా స్టార్ట్
X

ఉన్నట్టుంది సడెన్ గా బాలీవుడ్ ప్రాజెక్టులో ల్యాండ్ అయ్యాడు నాగచైతన్య. అమీర్ ఖాన్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. అమీర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాలో కీలకమైన ఓ చిన్న పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్ కోసం నాగచైతన్యను తీసుకున్నారు. చైతూకు ఇదే తొలి బాలీవుడ్ మూవీ.

ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు నాగచైతన్య. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. సినిమాలో అమీర్ ఖాన్, చైతూ ఫ్రెండ్స్ గా కనిపించబోతున్నారు. అమీర్ ఖాన్ తన ఆర్మీ రోజుల్ని గుర్తుచేసుకునే క్రమంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో.. అమీర్-చైతూ ఆర్మీ జవాన్ పాత్రల్లో కనిపించబోతున్నారు.

కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకుడు. కిరణ్ రావు, రాధిక చౌదరి లతో కలిసి అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యుల్ పూర్తవ్వగానే సినిమాకు సంబంధించి అప్ డేట్స్ బయటికి రానున్నాయి. చైతూ నటిస్తున్న తొలి బాలీవుడ్ ప్రాజెక్టు కావడంతో టాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

First Published:  8 July 2021 2:46 PM IST
Next Story