Telugu Global
Health & Life Style

అమెరికాలో డెల్టా హల్‌చల్

కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టిన అమెరికాలో ఇప్పుడు డెల్టావేరియంట్ హల్ చల్ చేస్తోంది. అమెరికాలో డెల్టా వేరియంట్‌ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. వరుసగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 52శాతం కేసులు ఈ వేరియంట్‌వేనని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ ప్రకటించింది. కరోనా వేరియంట్లలో డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే చాలా దేశాలకు ఈ డెల్టా వేరింట్ వ్యాపించింది. ఇందులో భాగంగానే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కేసులు చాలా […]

అమెరికాలో డెల్టా హల్‌చల్
X

కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టిన అమెరికాలో ఇప్పుడు డెల్టావేరియంట్ హల్ చల్ చేస్తోంది. అమెరికాలో డెల్టా వేరియంట్‌ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. వరుసగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 52శాతం కేసులు ఈ వేరియంట్‌వేనని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ ప్రకటించింది.

కరోనా వేరియంట్లలో డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే చాలా దేశాలకు ఈ డెల్టా వేరింట్ వ్యాపించింది. ఇందులో భాగంగానే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కేసులు చాలా తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. ఒకప్పుడు దేశంలో ఎక్కువగా కనిపించిన ఆల్ఫా వేరియంట్‌ ప్రస్తుతం 28.7 శాతానికి తగ్గి, డెల్టా వేరియంట్ కేసులు యాభై శాతానికి పెరిగాయి. రాబోయే రోజుల్లో ఈ వేరియంట్‌ మరింతగా వ్యాపించొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే అమెరికాలో వ్యాక్సినేషన్ పై ప్రజలు ఇంట్రెస్ట్ చూపకపోవడం ఈ వేరియంట్ వ్యాప్తికి మరో కారణంగా అక్కడి నిపుణులు చెప్తున్నారు. డెల్టా ప్రభావాన్ని తట్టుకోవాలంటే ఎక్కువమందికి టీకా ఇవ్వడమే మార్గమని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు టీకా తీసుకోని వారు డెల్టా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అక్కడి డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ వ్యాక్సిన్ కోసం ప్రజలు అంతగా ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలను మోటివేట్ చేసే పనిలో పడింది.

First Published:  8 July 2021 3:12 AM GMT
Next Story