రైతులు చల్లగా ఉంటే బాబు కళ్లు మండుతాయి.. విజయసాయి రెడ్డి ఘాటు ట్వీట్లు..!
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రాజెక్టులపై తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయిస్తూ అడ్డుతగులుతున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సొంత జిల్లా చిత్తూరుకు ప్రాజెక్టులు రావడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. చంద్రబాబు లాంటి నీచుడు చిత్తూరు […]
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రాజెక్టులపై తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయిస్తూ అడ్డుతగులుతున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సొంత జిల్లా చిత్తూరుకు ప్రాజెక్టులు రావడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు.
చంద్రబాబు లాంటి నీచుడు చిత్తూరు జిల్లాలో పుట్టడం ఇక్కడ ప్రజల దురదృష్టం అంటూ ఆయన మండిపడ్డారు. ‘గతంలో దివంగత నేత, వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపడితే వాటిని చంద్రబాబు అడ్డుకున్నాడు. తన మనుషులతో కేసులు వేయించి ప్రాజెక్టులను ఆపాడు.
ప్రస్తుతం సీఎం జగన్మోహన్రెడ్డి.. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులు కడుతుంటే వాటిని కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నాడు .. తన మనుషులతో కేసులు వేయిస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్టులను ఆపాలంటూ చంద్రబాబు మనుషులు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. చిత్తూరు జిల్లాలోని 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకోవాలని భావిస్తున్నాడు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
‘చంద్రబాబు లాంటి వాడికి ఎందుకు జన్మనిచ్చానా? అంటూ చిత్తూరు జిల్లా ఆవేదన చెందుతోంది. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వాడికి ఇదో లెక్కా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రం అక్రమంగా కృష్ణా జలాలను తరలించుకుపోతున్నదని.. నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని గతంలో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నదని ఏపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రులు సైతం ఆరోపణలు గుప్పిస్తున్నారు.