సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేస్తాడట
ఒక్కోసారి మహేష్ బాబు కాంపౌండ్ నుంచి భలే కామెడీగా ఫీలర్లు వస్తుంటాయి. ఈ హీరో ఏడాదికి ఒక సినిమా చేస్తే ఎక్కువ. అలాంటిది ఈసారి కచ్చితంగా రెండు సినిమాలు చేస్తాడని, ఒకేసారి రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొస్తాడని ఎప్పటికప్పుడు గాసిప్స్ వస్తుంటాయి. చాన్నాళ్లు అభిమానులు కూడా వీటిని నమ్మారు. ఆ తర్వాత మహేష్ సంగతి తెలిసి, నవ్వుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరో పుకారు బయల్దేరింది. ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా […]
ఒక్కోసారి మహేష్ బాబు కాంపౌండ్ నుంచి భలే కామెడీగా ఫీలర్లు వస్తుంటాయి. ఈ హీరో ఏడాదికి ఒక
సినిమా చేస్తే ఎక్కువ. అలాంటిది ఈసారి కచ్చితంగా రెండు సినిమాలు చేస్తాడని, ఒకేసారి రెండు
సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొస్తాడని ఎప్పటికప్పుడు గాసిప్స్ వస్తుంటాయి. చాన్నాళ్లు అభిమానులు
కూడా వీటిని నమ్మారు. ఆ తర్వాత మహేష్ సంగతి తెలిసి, నవ్వుకోవడం స్టార్ట్ చేశారు.
ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరో పుకారు బయల్దేరింది. ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా
చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్ లో మహేష్
పూర్తిచేసేస్తాడనేది తాజా పుకారు. మహేష్ గురించి తెలిసిన వాళ్లంతా ఇది చూసి నవ్వుకుంటుంటే,
తెలియని వాళ్లు దీన్ని వైరల్ చేస్తున్నారు.
సర్కారువారి పాట సినిమాకు సంబంధించి దుబాయ్ షెడ్యూల్ పూర్తయింది. ఆ తర్వాత హైదరాబాద్ లో
ఓ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. కరోనా వల్ల ఆ షెడ్యూల్ ఆగిపోయింది. రేపోమాపో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. అలా మొదలుకాబోతున్న షెడ్యూల్ తోనే టోటల్ సినిమాను పూర్తిచేయాలని మహేష్ భావిస్తున్నాడట. అదీ సంగతి.