థర్డ్ వేవ్ ఎప్పుడు? టీకాలు డెల్టాను అడ్డుకోగలవా?
కరోనా రెండో వేవ్ అలా తగ్గుముఖం పట్టిందో లేదో డెల్టా ప్లస్ వేరియంట్ మొదలైంది. ఇప్పుడిది ప్రమాదకరంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడానోమ్ ఘెబ్రేయెసుస్ హెచ్చరించారు ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తుందని వారు వెల్లడించారు. వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న దేశాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఈ వేరియంట్ 98 దేశాల్లో బయటపడిందని, తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించారు. […]
కరోనా రెండో వేవ్ అలా తగ్గుముఖం పట్టిందో లేదో డెల్టా ప్లస్ వేరియంట్ మొదలైంది. ఇప్పుడిది ప్రమాదకరంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడానోమ్ ఘెబ్రేయెసుస్ హెచ్చరించారు
ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తుందని వారు వెల్లడించారు. వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న దేశాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఈ వేరియంట్ 98 దేశాల్లో బయటపడిందని, తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనా ముప్పు నుంచి పూర్తిగా బయటపడలేదని డాక్టర్ టెడ్రోస్ అన్నారు.
ఇదిలా ఉంటే ఈ డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్ టీకా ఎంతమేర పనిచేస్తోందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా టీకా ఇచ్చిన కొందరి రక్త నమూనాలను సేకరించి విశ్లేషించారు. అందులో కోవిషీల్డ్ ఒక డోసు తీసుకున్న వారిలో 55 శాతం, రెండు డోసులు తీసుకున్న వారిలో 16.1 శాతం మందిలో డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు కనిపించలేదని ఐసీఎంఆర్ వైరాలజీ మాజీ డైరెక్టర్ టి.జాకబ్ జాన్ వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కోవిషీల్డ్ సింగిల్ డోసుతో డెల్టా వేరియంట్ నుంచి కాస్త రక్షణ లభిస్తోందని చెప్పారు.
ఇకపోతే కోవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్‌బీఐ ఎకనామిస్టులు చేసిన పరిశోధనలో కోవిడ్ థర్డ్ వేవ్ పీక్ సెప్టెంబర్‌లో ఉంటుందని తేలింది. జూలై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చని, ఆగస్ట్ మూడో వారానికి కేసుల సంఖ్య భారీగా పెరగొచ్చని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచనా వేసింది.