ఈనెల 15నుంచి ఏపీలో ఆన్ లైన్ క్లాసులు..
ఆగస్ట్ రెండోవారం నుంచి ఏపీలో అకడమిక్ ఇయర్ మొదలవుతుందని ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన నేపథ్యంలో నెలరోజుల ముందుగానే ఆ పని మొదలు పెట్టబోతున్నారు ఏపీ విద్యాశాఖ అధికారులు. ఈనెల 15నుంచి విద్యా సంవత్సరం మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈనెల 15నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు మొదలవుతాయని చెప్పారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు. ఈనెల 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు 50 శాతం హాజరవుతున్నారని, కొత్త […]
ఆగస్ట్ రెండోవారం నుంచి ఏపీలో అకడమిక్ ఇయర్ మొదలవుతుందని ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన నేపథ్యంలో నెలరోజుల ముందుగానే ఆ పని మొదలు పెట్టబోతున్నారు ఏపీ విద్యాశాఖ అధికారులు. ఈనెల 15నుంచి విద్యా సంవత్సరం మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు.
ఈనెల 15నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు మొదలవుతాయని చెప్పారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు. ఈనెల 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు 50 శాతం హాజరవుతున్నారని, కొత్త విద్యాసంవత్సరం బోధనకు వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ జరుగుతోందని అన్నారు. దూరదర్శన్, రేడియా, విద్యా వారధి ద్వారా ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాలలకు విద్యార్థుల్ని ఎప్పటి నుంచి అనుమతించాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
ప్రైవేటులో మొదలైన ఆన్ లైన్..
టెన్త్, ఇంటర్ పరీక్షల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ లో సందడి మొదలైంది. ఈనెల 1నుంచి ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లతో వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి, వాటిలో పాఠాల లింక్ లు షేర్ చేస్తున్నారు. లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఉన్నవారికి మాత్రమే ఆన్ లైన్ లో పాఠాలు వినే వెసులుబాటు కల్పించారు. ఫీజుల వసూలు కూడా ఆల్రడీ మొదలైపోయింది. మరోవైపు ప్రైవేటు ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు, ప్రత్యేక కమిటీ ఫీజులు నిర్ణయిస్తుందని విద్యాశాఖ మంత్రి చెప్పినా, ఆన్ లైన్ బోధన మాత్రమే కొనసాగే పక్షంలో 70శాతం ఫీజు మాత్రమే చెల్లించే నిబంధన విధిస్తున్నట్టు ప్రకటించినా, చాలాచోట్ల ప్రైవేటు స్కూల్స్ లో ఫీజుల వసూలు జోరుగా సాగుతోంది. ఆన్ లైన్ పాఠాలు మిస్ అవుతామేమోనన్న భయంతో తల్లిదండ్రులు ఫీజులు కట్టేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం మరో వారం రోజుల్లో ఆన్ లైన్ పాఠాలు మొదలవుతాయి.