Telugu Global
Cinema & Entertainment

గోపీచంద్ సినిమా మళ్లీ వాయిదా

ఏ ముహూర్తన లాంచ్ చేశారో కానీ గోపీచంద్ సినిమాకు అస్సలు టైమ్ కలిసిరావడం లేదు. దాదాపు మూడేళ్ల కిందట రిలీజ్ అవ్వాల్సిన ఆరడుగుల బుల్లెట్ మూవీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఈ నెలలో వస్తుందనున్న ఈ సినిమా ఇప్పుడు మరో నెల రోజులు పోస్ట్ పోన్ అయింది. గోపీచంద్, న‌య‌న‌తార హీరోహీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ […]

గోపీచంద్ సినిమా మళ్లీ వాయిదా
X

ఏ ముహూర్తన లాంచ్ చేశారో కానీ గోపీచంద్ సినిమాకు అస్సలు టైమ్ కలిసిరావడం లేదు. దాదాపు
మూడేళ్ల కిందట రిలీజ్ అవ్వాల్సిన ఆరడుగుల బుల్లెట్ మూవీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే
ఉంది. ఈ నెలలో వస్తుందనున్న ఈ సినిమా ఇప్పుడు మరో నెల రోజులు పోస్ట్ పోన్ అయింది.

గోపీచంద్, న‌య‌న‌తార హీరోహీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల
బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి
సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు
తీసుకురానున్నారు.

ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. గోపీచంద్,
న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ డైరెక్ష‌న్‌, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి
హైలెట్స్ అంటున్నాడు నిర్మాత. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే, ఆగస్ట్ లోనైనా ఈ సినిమా థియేటర్లలోకి
వస్తుందా అనేది అందరి డౌట్.

First Published:  5 July 2021 1:39 PM IST
Next Story