Telugu Global
NEWS

వన్ అండ్ ఓన్లీ మిథాలీ..

ఇండియన్ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్.. ప్రపంచ క్రికెట్ ఫార్మాట్ లో ఓ రికార్డు సృష్టించింది. మహిళా క్రికెటర్‌ ఐదారేళ్ల కంటే ఎక్కువ ఏళ్లు ఆడడం అరుదు. అలాంటిది మిథాలీ రెండు దశాబ్దాల పాటు ఆడుతూ.. క్రికెట్ చరిత్రలో ఓ కొత్త రికార్డు సృష్టించింది. 1999లో నేషనల్ టీంలోకి అడుగుపెట్టిన మిథాలీ ఇప్పటికీ పరుగుల వర్షం కురిపిస్తూనే ఉంది. వేల పరుగులు చేస్తూ.. సచిన్‌, కోహ్లీ, ధోనీలకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటుంది. తాజాగా 10,337 పరుగులు పూర్తి […]

వన్ అండ్ ఓన్లీ మిథాలీ..
X

ఇండియన్ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్.. ప్రపంచ క్రికెట్ ఫార్మాట్ లో ఓ రికార్డు సృష్టించింది. మహిళా క్రికెటర్‌ ఐదారేళ్ల కంటే ఎక్కువ ఏళ్లు ఆడడం అరుదు. అలాంటిది మిథాలీ రెండు దశాబ్దాల పాటు ఆడుతూ.. క్రికెట్ చరిత్రలో ఓ కొత్త రికార్డు సృష్టించింది.

1999లో నేషనల్ టీంలోకి అడుగుపెట్టిన మిథాలీ ఇప్పటికీ పరుగుల వర్షం కురిపిస్తూనే ఉంది. వేల పరుగులు చేస్తూ.. సచిన్‌, కోహ్లీ, ధోనీలకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటుంది. తాజాగా 10,337 పరుగులు పూర్తి చేసుకుని ప్రపంచ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమన్‌గా నిలిచింది.

16 ఏళ్ల వయసులో క్రికెట్ లోకి అడుగుపెట్టిన హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ.. తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టి అందర్నీ అబ్బురపరిచింది. ప్రపంచ క్రికెట్( పురుషులు, మహిళలు) ఫార్మాట్ లో అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన ప్లేయర్ గా మొదటి మ్యాచ్ లోనే రికార్డు బ్రేక్ చేసింది. ప్రస్తుతం మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు(10,337), అత్యధిక అర్థ శతకాలు(87) చేసిన వన్ అండ్ ఓన్లీ మిథాలీగా నిలిచింది.

భారత్‌ తరపున సుదీర్ఘ కాలం క్రికెట్‌ ఆడిన రెండవ ప్లేయర్ గా మిథాలీ నిలిచింది. అంతకుముందు ఒక జట్టు తరపున సుదీర్ఘకాలం క్రికెట్ ఏకైక వ్యక్తి సచిన్‌ టెండూల్కర్‌. అతని కెరీర్‌ 24 ఏళ్ల ఒక రోజు. మిథాలీ కెరీర్ 22 సంవత్సరాల 7 రోజులు.

First Published:  5 July 2021 1:13 AM GMT
Next Story