వైఎస్సార్టీపీ జెండా ఖరారు.. 8న పార్టీ ప్రారంభం..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి వైఎస్సార్టీపీ అనే పేరును ఖరారు చేశారు. తాజాగా పార్టీ జెండాను కూడా రూపొందించారు. జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు.. 20 శాతం నీలిరంగు మధ్యలో రాజశేఖర్‌రెడ్డి బొమ్మ ఉండేలా జెండాను రూపొందించారు. ఈ మేరకు పార్టీ కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ పార్టీ జెండా వివరాలను మీడియాకు విడుదల చేశారు. రాజశేఖర్‌రెడ్డి […]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి వైఎస్సార్టీపీ అనే పేరును ఖరారు చేశారు. తాజాగా పార్టీ జెండాను కూడా రూపొందించారు. జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు.. 20 శాతం నీలిరంగు మధ్యలో రాజశేఖర్‌రెడ్డి బొమ్మ ఉండేలా జెండాను రూపొందించారు.
ఈ మేరకు పార్టీ కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ పార్టీ జెండా వివరాలను మీడియాకు విడుదల చేశారు. రాజశేఖర్‌రెడ్డి జయంతి అయిన జూలై 8న పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? తదితర విషయాలపై వైఎస్ షర్మిల పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నారు.
ఈ పార్టీకి ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియ వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే ఎటువంటి వ్యూహాలు అవలంబించాలి. సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టాలి. కార్యకర్తలను ఎలా సమాయత్తం చేయాలి. రాష్ట్రంలో ఏ వర్గాలను కలుపుకొని ఎలా ముందుకు వెళ్లాలి తదితర విషయాలపై ఆమె సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
ఇప్పటికే వ్యూహకర్త ప్రియ.. పలుమార్లు వైఎస్ షర్మిలను కలిశారు. షర్మిల పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు భావించారు. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్‌రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన దూకుడుగా వెళ్తున్నారు.
ఇదిలా ఉంటే రెడ్డి సామాజికవర్గం, దళిత సామాజికవర్గం షర్మిల వెంట వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. షర్మిల కూడా పక్కా వ్యూహంతో రాజకీయ క్షేత్రంలోకి దిగారు. నిరుద్యోగులకు అండగా పోరాటాలు కూడా మొదలు పెట్టారు. అయితే అంతలోనే కరోనా రావడంతో ఆమె సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే విషయంపై చర్చలు జరుపుతున్నారు.