Telugu Global
Cinema & Entertainment

సర్కారువారి పాట కొత్త షెడ్యూల్ సెట్

లాక్ డౌన్ తర్వాత పెద్ద సినిమాలన్నీ మెల్లమెల్లగా సెట్స్ పైకొస్తున్నాయి. ఆదిపురుష్, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఆల్రెడీ సెట్స్ పైకి రాగా, ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. 15వ తేదీ నుంచి సర్కారువారి పాట సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు మహేష్. దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. అప్పటికే సిటీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ధైర్యం చేసి ముందుకెళ్లారు. అలాంటి టైమ్ […]

సర్కారువారి పాట కొత్త షెడ్యూల్ సెట్
X

లాక్ డౌన్ తర్వాత పెద్ద సినిమాలన్నీ మెల్లమెల్లగా సెట్స్ పైకొస్తున్నాయి. ఆదిపురుష్, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఆల్రెడీ సెట్స్ పైకి రాగా, ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. 15వ తేదీ నుంచి సర్కారువారి పాట సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు మహేష్.

దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. అప్పటికే సిటీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ధైర్యం చేసి ముందుకెళ్లారు. అలాంటి టైమ్ లో యూనిట్ లో ఆరుగురికి కరోనా సోకింది. స్వయంగా మహేష్ మేకప్ మేన్ కరోనా బారిన పడినట్టు వార్తలొచ్చాయి.

దీంతో అర్థాంతరంగా సినిమా షూటింగ్ ఆపేశారు. ఆ తర్వాత లాక్ డౌన్ పడ్డంతో గ్యాప్ వచ్చేసింది. అలా ఆగిపోయిన సర్కారువారి పాట సినిమాను 15వ తేదీను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఆ టైమ్ కు యూనిట్ లో అందరికీ వ్యాక్సిన్ వేయించాలని నిర్మాతలు టార్గెట్ గా పెట్టుకున్నారు.

First Published:  4 July 2021 1:16 PM IST
Next Story