Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు ఆ హీరోయిన్ కు మూవీ ఛాన్స్

హన్సిక ఎప్పుడో ఫేడవుట్ అయింది. తెలుగులోనే కాదు, తమిళ్ లో కూడా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అవకాశం రావడమే ఎక్కువ అన్నట్టు మారింది పరిస్థితి. ఇలాంటి టైమ్ తెలుగులో ఓ స్ట్రయిట్ మూవీ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె తెలుగులో న‌టిస్తున్న తొలి మ‌హిళా ప్ర‌ధాన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. ఈరోజు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది ఈ సినిమా. ఈ ఓపెనింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ ఆపిల్ బ్యూటీ. శ్రీ‌నివాస్ […]

ఎట్టకేలకు ఆ హీరోయిన్ కు మూవీ ఛాన్స్
X

హన్సిక ఎప్పుడో ఫేడవుట్ అయింది. తెలుగులోనే కాదు, తమిళ్ లో కూడా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అవకాశం రావడమే ఎక్కువ అన్నట్టు మారింది పరిస్థితి. ఇలాంటి టైమ్ తెలుగులో ఓ స్ట్రయిట్ మూవీ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఆమె తెలుగులో న‌టిస్తున్న తొలి మ‌హిళా ప్ర‌ధాన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. ఈరోజు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది ఈ సినిమా. ఈ ఓపెనింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ ఆపిల్ బ్యూటీ. శ్రీ‌నివాస్ ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సినిమాలో హన్సిక స్వేచ్ఛ-స్వతంత్రం మెండుగా ఉండే యువతిగా కనిపిస్తుందట. తన మనసులో భావాల్ని సూటిగా బయటకు చెబుతుందట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాలో ఎన్నో మలుపులు ఉంటాయట. ఆ కొత్తదనం నచ్చే ఈ సినిమా చేయడానికి అంగీకరించిందట హన్సిక.

First Published:  4 July 2021 1:17 PM IST
Next Story