Telugu Global
Cinema & Entertainment

కేంద్రం తీరుపై హీరో సూర్య ఆగ్రహం..!

కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ బిల్లును సవరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సవరించిన బిల్లు అమల్లోకి వస్తే.. ఏదైనా సినిమాకు సెన్సార్​ బోర్డు నుంచి అనుమతి వచ్చినా.. ఒక వేళ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే మళ్లీ ఆ సినిమాను ఆపేయవచ్చు. డిజిటల్​ మీడియా, థియేటర్లు, టీవీ ఎక్కడా ప్రదర్శించకుండా ఆపేయవచ్చు. ఈ బిల్లు సవరణపై సినీ ప్రముఖులు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారు. ఇది కచ్చితంగా స్వేచ్ఛను హరించడమే అని వాళ్లు వాదిస్తున్నారు.కేంద్రానికి ఇష్టమైన సినిమాలు మాత్రమే […]

కేంద్రం తీరుపై హీరో సూర్య ఆగ్రహం..!
X

కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ బిల్లును సవరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సవరించిన బిల్లు అమల్లోకి వస్తే.. ఏదైనా సినిమాకు సెన్సార్​ బోర్డు నుంచి అనుమతి వచ్చినా.. ఒక వేళ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే మళ్లీ ఆ సినిమాను ఆపేయవచ్చు. డిజిటల్​ మీడియా, థియేటర్లు, టీవీ ఎక్కడా ప్రదర్శించకుండా ఆపేయవచ్చు. ఈ బిల్లు సవరణపై సినీ ప్రముఖులు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారు.

ఇది కచ్చితంగా స్వేచ్ఛను హరించడమే అని వాళ్లు వాదిస్తున్నారు.కేంద్రానికి ఇష్టమైన సినిమాలు మాత్రమే తీయాలని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీయడానికి వీల్లేకుండా కొత్త చట్టంలో మార్పులు తీసుకొచ్చారని వారు వాదిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నటుడు సూర్య స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు స్వేచ్ఛను హరించేలా ఉందని.. ఈ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన బిల్లు సవరణను ఇప్పటికే కమల్ హాసన్​, బాలీవుడ్​లోని పలువురు అగ్రనటులు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగేలా ఉందని వారు వాదిస్తున్నారు.

First Published:  3 July 2021 12:51 AM IST
Next Story