కమ్ముల-ధనుష్ మూవీలో పెద్ద హీరో
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పట్నుంచి.. ఈ కాంబినేషన్ లో రాబోతున్న కథ ఎలాంటిదై ఉంటుందనే అనుమానం అందర్లో ఉంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కొన్ని వివరాలు బయటకొచ్చాయి. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ రాసుకున్నాడట శేఖర్ కమ్ముల. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఆ సబ్జెక్ట్ లో ధనుష్ ను హీరోగా తీసుకున్నాడు. నిజానికి గతంలో […]
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ
సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పట్నుంచి.. ఈ కాంబినేషన్ లో రాబోతున్న కథ ఎలాంటిదై ఉంటుందనే
అనుమానం అందర్లో ఉంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కొన్ని వివరాలు బయటకొచ్చాయి.
కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ రాసుకున్నాడట శేఖర్ కమ్ముల. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఆ
సబ్జెక్ట్ లో ధనుష్ ను హీరోగా తీసుకున్నాడు. నిజానికి గతంలో ఓసారి థ్రిల్లర్ సబ్జెక్ట్ చేశాడు కమ్ముల.
నయనతారతో అనామిక అనే మూవీ తీశాడు. కానీ అది రీమేక్. అతడు సొంతంగా రాసుకున్న మొదటి
థ్రిల్లర్ సబ్జెక్ట్ మాత్రం ధనుష్ సినిమానే.
ఈ ప్రాజెక్టులో హీరో తర్వాత హీరో లాంటి మరో కీలకమైన పాత్ర ఉందట. అదొక పోలీస్ క్యారెక్టర్. ఈ
పాత్రను ఓ పెద్ద హీరోతో చేయించాలనే ఆలోచనలో యూనిట్ ఉంది. నిన్న ధనుష్, కమ్ముల, నిర్మాత
సునీల్ నారంగ్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో ఈ అంశాలన్నీ చర్చకొచ్చినట్టు తెలుస్తోంది.