Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ వైపు రకుల్ అడుగులు

ఇప్పటికే కాజల్, తమన్న, సమంత ఓటీటీ వైపు అడుగులు వేశారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ వంతు. ఈ ముద్దుగుమ్మ కూడా ఓటీటీలో అడుగుపెట్టింది. ఓ ఒరిజినల్ మూవీ చేస్తోంది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటివలే పూర్తయింది. చెన్నై లో కొన్ని రోజులు షూట్ చేసిన యూనిట్ తాజాగా హైదరాబాద్ గండిపేట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. నిన్నటి వరకు షూట్ జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ , విశ్వక్ […]

ఓటీటీ వైపు రకుల్ అడుగులు
X

ఇప్పటికే కాజల్, తమన్న, సమంత ఓటీటీ వైపు అడుగులు వేశారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ వంతు. ఈ
ముద్దుగుమ్మ కూడా ఓటీటీలో అడుగుపెట్టింది. ఓ ఒరిజినల్ మూవీ చేస్తోంది. తమిళ దర్శకుడు ఏఎల్
విజయ్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటివలే పూర్తయింది. చెన్నై లో కొన్ని రోజులు షూట్ చేసిన
యూనిట్ తాజాగా హైదరాబాద్ గండిపేట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు.

నిన్నటి వరకు షూట్ జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ , విశ్వక్ సేన్ లపై సీన్స్ తీశారు. విశ్వక్ సేన్ ఇందులో
అతిథి పాత్ర చేస్తున్నాడు. విద్యుల్లేక రామన్ తో పాటు మరికొంతమంది నటీనటులు ఇందులో
నటిస్తున్నారు.

హ్యాలోవీన్ నేపథ్యంలో హారర్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగే ఈ ఒరిజినల్ ఫిలింకి ‘అక్టోబర్ 31 లేడీస్
నైట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో కథ మొత్తం రకుల్ పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. నాలుగైదు
కథలను ఓకె కథగా చేర్చి ఈ ఓటీటీ సినిమాను తెరకెక్కిస్తున్నాడట విజయ్. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్
ఎనౌన్స్ చేస్తారు.

First Published:  2 July 2021 2:55 PM IST
Next Story