Telugu Global
National

నకిలీ వ్యాక్సిన్ స్కామ్.. బెంగాల్ గవర్నర్ పై ఆరోపణలు..

ఉత్తరాదిని నకిలీ వ్యాక్సిన్ స్కామ్ ఊపేస్తోంది. పశ్చిమబెంగాల్ లో దేబాంజన్ దేవ్ అనే వ్యక్తి తనని తాను ఐఏఎస్ ఆఫీసర్ గా పరిచయం చేసుకుంటూ ఏకంగా ఎంపీ మిమి చక్రవర్తినే బోల్తా కొట్టించాడు. వ్యాక్సిన్ పేరుతో 2వేలమందికి నకిలీ ఇంజెక్షన్లు ఇప్పించాడు. ఈ కేసులో అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ స్కామ్ పై లోతైన విచారణకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమించింది. అయితే ఈ స్కామ్ వ్యవహారం […]

నకిలీ వ్యాక్సిన్ స్కామ్.. బెంగాల్ గవర్నర్ పై ఆరోపణలు..
X

ఉత్తరాదిని నకిలీ వ్యాక్సిన్ స్కామ్ ఊపేస్తోంది. పశ్చిమబెంగాల్ లో దేబాంజన్ దేవ్ అనే వ్యక్తి తనని తాను ఐఏఎస్ ఆఫీసర్ గా పరిచయం చేసుకుంటూ ఏకంగా ఎంపీ మిమి చక్రవర్తినే బోల్తా కొట్టించాడు. వ్యాక్సిన్ పేరుతో 2వేలమందికి నకిలీ ఇంజెక్షన్లు ఇప్పించాడు. ఈ కేసులో అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ స్కామ్ పై లోతైన విచారణకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమించింది.

అయితే ఈ స్కామ్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. వ్యాక్సినేషన్ స్కామ్ కి కారణం అధికార టీఎంసీఏనంటూ ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. దీనిపై ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేసిన ప్రతిపక్షనేత సువేందు అధికారి, టీఎంసీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే క్రమంలో ఇటు టీఎంసీ నేతలు కూడా బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ ఆరోపణలను తిప్పికొడుతూ.. ఈ స్కామ్ లోకి గవర్నర్ జగదీప్ ధన్ కర్ పేరు తీసుకొచ్చారు. టీకా స్కామ్ సూత్రధారి దేబాంజన్ దేవ్ సెక్యూరిటీ సిబ్బంది అరవింద్ వైద్య, గవర్నర్ ఫ్యామిలీతో కలసి దిగిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. సదరు సెక్యూరిటీ ఆఫీసర్ కి గవర్నర్ కి సంబంధం ఉందని, ఆయన కూడా ఈ స్కామ్ లో భాగస్వామి అంటూ ఆరోపించారు. అరవింద్ వైద్య అనే సెక్యూరిటీ సిబ్బందితో ప్రముఖులకు కాస్ట్ లీ గిఫ్ట్ లు పంపించడం దేబాంజన్ దేవ్ కి అలవాటని అంటున్నారు. అలా గవర్నర్ ని కూడా బుట్టలో పడేసుకుని వారి జట్టులో చేర్చుకున్నారని చెబుతున్నారు.

టీఎంసీ రెండోసారి అధికారంలోకి వచ్చాక గవర్నర్ తో మమతా బెనర్జీ డైరెక్ట్ ఫైట్ కి దిగారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు టీఎంసీయే కారణం అంటూ గతంలో గవర్నర్ మమతను టార్గెట్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ తుఫాన్ పరామర్శ వ్యవహారంపై కూడా గవర్నర్, సీఎం మధ్య మాటల తూటాలు పేలాయి. తాజాగా గవర్నర్ జగదీప్ ధన్ కర్ కి భూకబ్జాతో సంబంధం ఉందని, ఆయన్ను వెనక్కు పిలిపించాలని పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు గవర్నర్ పై టీఎంసీ నేతలు చేసిన ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి.

First Published:  2 July 2021 2:16 AM IST
Next Story