Telugu Global
Cinema & Entertainment

ఒకే రోజు 2 సినిమాలు సెట్స్ పైకి

లాక్ డౌన్ తర్వాత సినిమాలన్నీ ఒకేసారి సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలు తమ షూటింగ్స్ మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఈ రోజు రెండు క్రేజీ ప్రాజక్టులు ఒకేసారి సెట్స్ పైకి వచ్చాయి. అందులో ఒకటి ఎఫ్3 కాగా, రెండోది శ్యామ్ సింగరాయ్. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్3 సినిమా ఈరోజు సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షెడ్యూల్ మొదలైంది. […]

ఒకే రోజు 2 సినిమాలు సెట్స్ పైకి
X

లాక్ డౌన్ తర్వాత సినిమాలన్నీ ఒకేసారి సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలు తమ షూటింగ్స్ మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఈ రోజు రెండు క్రేజీ ప్రాజక్టులు ఒకేసారి సెట్స్ పైకి వచ్చాయి. అందులో ఒకటి ఎఫ్3 కాగా, రెండోది శ్యామ్ సింగరాయ్.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్3 సినిమా ఈరోజు సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షెడ్యూల్ మొదలైంది. పూర్తి జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేశారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను లెక్కప్రకారం ఆగస్ట్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ టైమ్ కు సినిమా రావడం అసంభవం.

ఇక నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ కూడా ఈరోజే సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన వింటేజ్ కోల్ కతా సెట్ లో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. తన సినిమా కొత్త షెడ్యూల్ మొదలైన విషయాన్ని నాని స్వయంగా వెల్లడించాడు.

నిజానికి ఈ సినిమా కోసం లాక్ డౌన్ కు ముందే 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్ వేశారు. కానీ వర్షాలకు అది పాడైపోయింది. దాన్ని బాగుచేసి, ఇవాళ్టి నుంచి షూటింగ్ స్టార్ట్ చేశారు.

First Published:  1 July 2021 2:39 PM IST
Next Story