Telugu Global
International

కోవాక్సిన్ కి ఎదురుదెబ్బ.. బ్రెజిల్ డీల్ క్యాన్సిల్..

భారత్ బయోటెక్ సంస్థతో బ్రెజిల్ ప్రభుత్వం కుదుర్చుకున్న టీకా డీల్ క్యాన్సిల్ అయింది. ఈ డీల్ పై ఇటీవల తీవ్ర దుమారం రేగింది. అధిక రేటుకి టీకా కొనుకోలు కోసం నిధుల గోల్ మాల్ జరిగిందని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో 2కోట్ల టీకా డోసుల కొనుగోలుకి 2వేల400కోట్ల రూపాయలతో భారత్ బయోటెక్ తో బ్రెజిల్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు అక్కడి అధికారులు. భారత్ […]

కోవాక్సిన్ కి ఎదురుదెబ్బ.. బ్రెజిల్ డీల్ క్యాన్సిల్..
X

భారత్ బయోటెక్ సంస్థతో బ్రెజిల్ ప్రభుత్వం కుదుర్చుకున్న టీకా డీల్ క్యాన్సిల్ అయింది. ఈ డీల్ పై ఇటీవల తీవ్ర దుమారం రేగింది. అధిక రేటుకి టీకా కొనుకోలు కోసం నిధుల గోల్ మాల్ జరిగిందని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో 2కోట్ల టీకా డోసుల కొనుగోలుకి 2వేల400కోట్ల రూపాయలతో భారత్ బయోటెక్ తో బ్రెజిల్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు అక్కడి అధికారులు.

భారత్ బయోటెక్ కి చెందిన కోవాక్సిన్ టీకా కొనుగోలు చేసేందుకు ఫిబ్ర‌వ‌రిలో బ్రెజిల్ ఆరోగ్య‌శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రెసికా మెడికోమెంట‌స్ ఫార్మ‌సీ సంస్థ దీనికి మధ్యవర్తిత్వం నడిపింది. అయితే నెలలు గడుస్తున్నా టీకా సరఫరా కాలేదు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకపోవడంతో టీకా పంపిణీకి అవాంతరం ఏర్పడింది. దీంతో బ్రెజిల్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకముందే పెద్ద మొత్తం ఖర్చు చేసి కోవాక్సిన్ దిగుమతికి ఎందుకు అత్యుత్సాహం చూపారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, ఫైజర్ వంటి టీకాలను కాదని, ఏరికోరి ఎక్కువరేటుకి కోవాక్సిన్ ఎందుకు కొనుగోలు చేయాలనుకున్నారో తేల్చేందుకు విచారణ మొదలైంది. పార్ల‌మెంట‌రీ క‌మిటీ చేప‌ట్టిన ద‌ర్యాప్తులో ఆరోగ్య‌శాఖ తప్పిదం ఉన్నట్టు నిర్థారణ అయింది. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం ఆ డీల్ క్యాన్సిల్ చేసింది.

ఇటు భారత్ బయోటెక్ సంస్థ కూడా డీల్ క్యాన్సిల్ పై ప్రకటన విడుదల చేసింది. బ్రెజిల్ కు కోవాక్సిన్ సరఫరా చేసేందుకు తాము ఎలాంటి అడ్వాన్స్ తీసుకోలేదని, ఆదేశానికి కోవిడ్ టీకాల‌ను తాము స‌ర‌ఫ‌రా చేయ‌లేద‌ని భార‌త్ బ‌యోటెక్ సంస్థ పేర్కొంది. 8 నెల‌ల పాటు సాగిన ఒప్పంద ప్ర‌క్రియ విధానంలో అన్ని ష‌ర‌తులు తాము పాటించామని, అయినా తమకు పేమెంట్ అందలేదని చెప్పారు సంస్థ ప్రతినిధులు. విదేశాలకు ఎగుమతి చేసే కోవిడ్ టీకా ధరను 15నుంచి 20 డాలర్ల మధ్య ఫిక్స్ చేశామని, బ్రెజిల్ తో సహా పలు ఇతర దేశాలకు కూడా 15డాలర్లకు టీకా సరఫరాలు ఒప్పందాలు కుదిరాయని అన్నారు. ఇతర దేశాల విషయంలో ఒప్పందం ప్రకారం టీకాలు సరఫరా చేస్తున్నామని, బ్రెజిల్ నుంచి మాత్రం తమకు ఎలాంటి అడ్వాన్స్ అందలేదని చెప్పారు.

First Published:  30 Jun 2021 12:07 PM IST
Next Story