Telugu Global
Health & Life Style

కరోనాతో మరోముప్పు.. ముఖపక్షవాతం..!

కరోనా నుంచి కోలుకున్నాక కూడా చాలా మందికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కరోనా సోకితే.. వారు కోలుకున్నాక సైతం కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్నాక చాలా మందిలో ‘బెల్స్​పాల్సీ’ అనే వ్యాధి వస్తున్నది. దీన్నే ముఖ పక్షవాతం అంటారు. కరోనా వ్యాక్సిన్​ తీసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యూనివర్సిటీ హాస్పిటల్ క్లీవ్‌ల్యాండ్ మెడికల్ సెంటర్, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ స్కూల్ […]

కరోనాతో మరోముప్పు.. ముఖపక్షవాతం..!
X

కరోనా నుంచి కోలుకున్నాక కూడా చాలా మందికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కరోనా సోకితే.. వారు కోలుకున్నాక సైతం కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్నాక చాలా మందిలో ‘బెల్స్​పాల్సీ’ అనే వ్యాధి వస్తున్నది. దీన్నే ముఖ పక్షవాతం అంటారు. కరోనా వ్యాక్సిన్​ తీసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

యూనివర్సిటీ హాస్పిటల్ క్లీవ్‌ల్యాండ్ మెడికల్ సెంటర్, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ వ్యాధిపై పరిశోధనలు సాగించారు. అయితే లక్ష మంది కరోనా బాధితుల్లో దాదాపు 82 మంది ఈ వ్యాధి బారినపడినట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అయితే టీకా తీసుకున్న వారిలో ఈ వ్యాధి ముప్పు తక్కువగానే ఉంది. టీకా తీసుకున్న లక్ష మందిలో కేవలం 19 మందికి మాత్రమే ఈ వ్యాధి సోకింది.

కరోనా రాకుండా టీకా తీసుకోవడం చాలా ఉత్తమమని శాస్త్రవేత్తలు అంటున్నారు. బెల్స్​పాల్సీ పక్షవాతం లాంటి ఓ వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారిలో కండరాలు బలహీనంగా తయారవుతాయి. ముఖ్యంగా ముఖం మీద ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ కండరాలు వేలాడబడతాయి. ఇక ఒక్కోసారి కన్ను కూడా పూర్తిగా మూయలేకపోతారు.

అయితే ఈ వ్యాధిని గుర్తిస్తే 6 నెలల్లో కోలుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా అమెరికాలో కనిపిస్తోంది. ముఖ్యంగా షుగర్​, బీపీ ఉన్న వాళ్లకు కరోనా సంక్రమించినప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

First Published:  30 Jun 2021 2:29 AM GMT
Next Story