Telugu Global
Cinema & Entertainment

సమంత కూడా సెట్స్ పైకొచ్చింది

సినిమాలన్నీ చకచకా సెట్స్ పైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా లాంగ్ గ్యాప్ తర్వాత సమంత కూడా సెట్స్ పైకి వచ్చింది. శాకుంతలం సినిమా రెండో షెడ్యూల్ మొదలుపెట్టింది. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే సమంత, దేవ్ మోహన్ పై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సినిమా షూటింగ్ ఇప్పటికే 50శాతం పూర్తయిందట. ఈ విషయాన్ని నిర్మాత, గుణశేఖర్ కూతురు నీలిమ గుణ బయటపెట్టింది. త్వరలోనే […]

సమంత కూడా సెట్స్ పైకొచ్చింది
X

సినిమాలన్నీ చకచకా సెట్స్ పైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా లాంగ్ గ్యాప్ తర్వాత సమంత కూడా
సెట్స్ పైకి వచ్చింది. శాకుంతలం సినిమా రెండో షెడ్యూల్ మొదలుపెట్టింది. ఈ సినిమా కోసం రామోజీ
ఫిలింసిటీలో భారీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే సమంత, దేవ్ మోహన్ పై కీలక సన్నివేశాలు తీస్తున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సినిమా షూటింగ్ ఇప్పటికే 50శాతం పూర్తయిందట. ఈ విషయాన్ని
నిర్మాత, గుణశేఖర్ కూతురు నీలిమ గుణ బయటపెట్టింది. త్వరలోనే ఓ మంచి రోజు చూసి సమంత ఫస్ట్
లుక్ కూడా రిలీజ్ చేస్తామని ఆమె ప్రకటించింది

దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు మణిశర్మ
సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్
కనిపించబోతున్నారు. ఈ సినిమాపై సమంత భారీ అంచనాలు పెట్టుకుంది.

First Published:  29 Jun 2021 3:13 PM IST
Next Story