Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ టాకీపార్ట్ షూటింగ్ పూర్తి

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ (ర‌ణం రౌద్రం రుధిరం) మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పాట‌లు మిన‌హా టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ పాట‌ల చిత్రీక‌రణ‌తో ఎంటైర్ షూటింగ్ పూర్త‌వుతుంది. మ‌రోవైపు ‘ఆర్ఆర్ఆర్‌’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్.. తెలుగు, త‌మిళ భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే మిగిలిన భాష‌ల‌కు సంబంధించిన […]

ఆర్ఆర్ఆర్ టాకీపార్ట్ షూటింగ్ పూర్తి
X

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ (ర‌ణం రౌద్రం రుధిరం) మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పాట‌లు మిన‌హా టాకీ
పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ పాట‌ల చిత్రీక‌రణ‌తో ఎంటైర్ షూటింగ్ పూర్త‌వుతుంది.

మ‌రోవైపు ‘ఆర్ఆర్ఆర్‌’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఎన్టీఆర్‌,
చ‌ర‌ణ్.. తెలుగు, త‌మిళ భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే మిగిలిన భాష‌ల‌కు
సంబంధించిన డ‌బ్బింగ్‌ను కూడా పూర్తి చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

స్వాతంత్య్ర స‌మ‌ర యోధులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాల‌ను ఆధారంగా చేసుకుని
రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్
స్ఠార్స్ అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రేస్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి
త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న ఆర్ఆర్ఆర్
విడుదలవుతుందని యూనిట్ ప్రకటించింది

First Published:  29 Jun 2021 3:18 PM IST
Next Story