ఆహాలో వీకెండ్ మరో 2 మూవీస్
సినిమా హిట్టా ఫ్లాపా అనే సంబంధం లేకుండా వారానికో మూవీని స్ట్రీమింగ్ కు పెడుతోంది ఆహా యాప్. ఇందులో భాగంగా ఈ వీకెండ్ కూడా రెండు సినిమాల్ని సిద్ధం చేసింది. ఆ రెండూ ప్లాప్ సినిమాలే. మాస్ ఎంటర్‌టైనర్ ‘పొగరు’, పునర్జన్మల నేపథ్యంలో రూపొందిన ప్రేమ కథా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రాలు జూలై 2న ‘ఆహా’లో ప్రసారమవుతున్నాయి. ధృవ్ సర్జా, రష్మిక జంటగా నటించిన ‘పొగరు’ సినిమా తెలుగులో డిజాస్టర్ అయింది. ఇందులోంచి […]
సినిమా హిట్టా ఫ్లాపా అనే సంబంధం లేకుండా వారానికో మూవీని స్ట్రీమింగ్ కు పెడుతోంది ఆహా యాప్.
ఇందులో భాగంగా ఈ వీకెండ్ కూడా రెండు సినిమాల్ని సిద్ధం చేసింది. ఆ రెండూ ప్లాప్ సినిమాలే.
మాస్ ఎంటర్‌టైనర్ ‘పొగరు’, పునర్జన్మల నేపథ్యంలో రూపొందిన ప్రేమ కథా చిత్రం ‘30 రోజుల్లో
ప్రేమించడం ఎలా?’ చిత్రాలు జూలై 2న ‘ఆహా’లో ప్రసారమవుతున్నాయి. ధృవ్ సర్జా, రష్మిక జంటగా
నటించిన ‘పొగరు’ సినిమా తెలుగులో డిజాస్టర్ అయింది. ఇందులోంచి కేవలం టైటిల్ సాంగ్ మాత్రమే
హిట్టయింది.
అటు ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా కూడా అదే రోజు
స్ట్రీమింగ్ కు వస్తోంది. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన సినిమా ఇది. అమృతా అయ్యర్
హీరోయిన్‌గా నటించింది.
ఈ రెండు సినిమాలు కాకుండా.. క్రాక్, నాంది, జాంబి రెడ్డి, చావు కబురు చల్లగా, జీవి, ఎల్.కె.జి వంటి
సినిమాలు ఆహా ఓటీటీలో ఉన్నాయి.