Telugu Global
National

ముంబైలో 51శాతం మంది పిల్లల్లో కరోనా యాంటీబాడీలు..

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) చేపట్టిన సీరో సర్వే ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. ముంబైలో 1నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో 51.18శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్టు ప్రకటించింది. 2176మంది చిన్నారుల రక్తనమూనాలు సేకరించి ఈ సర్వే చేపట్టారు. గతంలో చేపట్టిన సర్వేలో 39.4శాతం మంది పిల్లల్లో యాంటీబాడీలున్నట్టు గుర్తించారు. తాజా సర్వేలో అది 51.18శాతానికి పెరగడం గమనార్హం. కొవిడ్ యాంటీబాడీలు ఉత్పన్నం అయ్యాయంటే, కచ్చితంగా వారంతా కొవిడ్ బారిన పడి కోలుకున్నట్టే. […]

ముంబైలో 51శాతం మంది పిల్లల్లో కరోనా యాంటీబాడీలు..
X

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) చేపట్టిన సీరో సర్వే ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. ముంబైలో 1నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో 51.18శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్టు ప్రకటించింది. 2176మంది చిన్నారుల రక్తనమూనాలు సేకరించి ఈ సర్వే చేపట్టారు. గతంలో చేపట్టిన సర్వేలో 39.4శాతం మంది పిల్లల్లో యాంటీబాడీలున్నట్టు గుర్తించారు. తాజా సర్వేలో అది 51.18శాతానికి పెరగడం గమనార్హం.

కొవిడ్ యాంటీబాడీలు ఉత్పన్నం అయ్యాయంటే, కచ్చితంగా వారంతా కొవిడ్ బారిన పడి కోలుకున్నట్టే. కొవిడ్ వైరస్ తో పోరాడిన వారి శరీర కణజాలం, భవిష్యత్తులో వచ్చే వైరస్ ని సమర్థంగా ఎదుర్కొనేందుకు యాంటీబాడీలను సిద్ధం చేసుకుంది. టీకాలు చేసే పని కూడా ఇదే. టీకాలతో శరీరంలో కృత్రిమంగా ఇలా యాంటీబాడీలు వృద్ధి అయ్యేలా చేస్తారు. కొవిడ్ సోకినవారిలో సహజంగానే అవి ఉత్పన్నం అవుతాయి. అయితే ముంబైలో కొవిడ్ యాంటీబాడీలు కలిగి ఉన్న పిల్లల్లో చాలామందిలో కరోనా లక్షణాల్లో ఒక్కటి కూడా కనిపించలేదని తల్లిదండ్రులు చెపుతున్నారు. అంటే ఇవన్నీ అసింప్టమాటిక్ కేసులు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఏప్రిల్-జూన్15మధ్యలో ఈ సర్వే చేపట్టిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ఫలితాలు వెల్లడించింది.

థర్డ్ వేవ్ ముప్పు పిల్లలకు ఎక్కువగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో చాలామంది నిపుణులు ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇప్పుడు ముంబై కార్పొరేషన్ చేపట్టిన సర్వే కూడా దీన్ని స్పష్టం చేస్తోంది. సెకండ్ వేవ్ లోనే దాదాపుగా 50శాతం పైగా పిల్లలు కరోనా బారిన పడి కోలుకున్నారు. వారిలో యాంటీబాడీలు కూడా డెవలప్ అయ్యాయి. ఇక థర్డ్ వేవ్ వచ్చినా, సెకండ్ వేవ్ కంటే ఉధృతంగా ఉన్నా కూడా పిల్లలకు అది ముప్పుగా పరిణమించే అవకాశాలు తక్కువనే చెప్పాలి.

First Published:  29 Jun 2021 4:06 AM IST
Next Story